logo

వైద్యవిద్య ఫలితాల్లో పీఈఎస్‌ విద్యార్థుల ప్రతిభ

విజయవాడలోని డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్య వర్సిటీ విడుదల చేసిన ఎంబీబీఎస్‌ మొదటి ఏడాది పరీక్ష ఫలితాల్లో పీఈఎస్‌ వైద్య కళాశాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ చాటినట్లు ప్రిన్సిపల్‌ డాక్ఱర్‌ హెచ్‌.ఆర్‌.క్రిష్ణారావు ప్రకటనలో తెలిపారు.

Published : 22 Mar 2023 03:52 IST

సాయిజాహ్నవి, పవిత్ర

కుప్పం, న్యూస్‌టుడే: విజయవాడలోని డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్య వర్సిటీ విడుదల చేసిన ఎంబీబీఎస్‌ మొదటి ఏడాది పరీక్ష ఫలితాల్లో పీఈఎస్‌ వైద్య కళాశాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ చాటినట్లు ప్రిన్సిపల్‌ డాక్ఱర్‌ హెచ్‌.ఆర్‌.క్రిష్ణారావు ప్రకటనలో తెలిపారు. తొమ్మిది డిస్టిన్‌క్షన్లు, 81 మంది ప్రథమ శ్రేణి, 40 మంది ద్వితీయ శ్రేణిలో ఉత్ణీర్ణులై 87 శాతం ఉత్తీర్ణతను సాధించినట్లు వివరించారు. విద్యా ఫలితాల్లో రాష్ట్రస్థాయి ప్రథమ స్థానంలో నిలిచామన్నారు. ఇందులో ఎం.సాయిజాహ్నవి 81 శాతం, ఎన్‌.పవిత్ర 79, రమేష్‌తరుణ్‌ 78, కె.మహేంద్రరెడ్డి 78, సీఎన్‌వీ కౌశిక్‌ 77, పి.సుదేష్ణ 76, వి.స్వర్ణసుమన 76, కె.వకులాదేవి 76, వీఎస్‌ హర్షిణి 76 శాతం ఉత్తీర్ణతతో టాపర్లుగా నిలిచారన్నారు. ఉత్తమ ఫలితాలు సాధించడంపై పీఈఎస్‌ యూనివర్సిటీ ఛాన్సలన్‌ డాక్టర్‌ ఎం.ఆర్‌.దొరస్వామి అభినందించారని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు