శిక్షణ.. ఉపాధి నిచ్చెన
నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఏపీఎస్‌ఆర్టీసీ ద్వారా నైపుణ్యంతో కూడిన డ్రైవింగ్ శిక్షణ అందించడానికి హెవీ డ్రైవింగ్ స్కూల్‌ను ప్రారంభించింది.
ఆర్టీసీలో హెవీ డ్రైవింగ్ స్కూల్
మహిళా డ్రైవర్ పూర్ణిమ
న్యూస్‌టుడే, తిరుపతి(ఆర్టీసీ): నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఏపీఎస్‌ఆర్టీసీ ద్వారా నైపుణ్యంతో కూడిన డ్రైవింగ్ శిక్షణ అందించడానికి హెవీ డ్రైవింగ్ స్కూల్‌ను ప్రారంభించింది. రాష్ట్రంలోని ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఒక స్కూల్ ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని తిరుపతి అలిపిరి డిపోలో నెలకొల్పారు. 2020 అక్టోబరు 14వ తేదీన ప్రారంభమైన స్కూల్‌లో బ్యాచ్‌కు 16 మంది అభ్యర్థుల చొప్పున ఇప్పటి వరకు మొత్తం 18 బ్యాచ్‌లు విజయవంతంగా పూర్తి చేసుకున్నాయి. 19వ బ్యాచ్ కొనసాగుతోంది. ఇప్పటివరకు మొత్తం 290 మందికిగాను 272 మంది అభ్యర్థులు శిక్షణ విజయవంతంగా పూర్తి చేసుకుని హెవీ డ్రైవింగ్ లైసెన్సుకు అర్హత సాధించారు. వీరిలో 125 మంది ఎంబీఏ, బీటెక్, ఎంటెక్, ఎంఎస్‌సీ, డిగ్రీ చదివిన వారు కాగా... మిగిలిన 147 మంది ఇంటర్మీడియట్, ఐటీఐ, పదో తరగతి ఉత్తీర్ణత సాధించిన వారు.
రాష్ట్రంలో రెండో స్థానం
వీరిలో ప్రస్తుతం 25 మంది ఆర్టీసీ అద్దె ప్రాతిపదికన నూతనంగా ప్రవేశపెట్టిన విద్యుత్తు ఏసీ బస్సులకు, 10 మంది కాల్ డ్రైవర్లు (రోజువారీ వేతనం)గా వివిధ డిపోల్లో, 12 మంది వివిధ డిపోల్లో పార్కింగ్ డ్రైవర్లుగా మిగిలిన వారు కళాశాల, పాఠశాలల బస్సులకు డ్రైవర్లుగా విధులు నిర్వర్తిస్తున్నారు. 30 మంది డ్రైవర్లు కావాలని కరకంబాడీలోని అమరరాజ సంస్థ కోరింది. ఇలా యువతకు నైపుణ్యంతో కూడిన శిక్షణతో పాటు ఉపాధి అవకాశాలు కల్పించడంలో స్కూలు రాష్ట్రంలో రెండోస్థానంలో నిలిచింది.
ప్రభుత్వం స్పందిస్తే మరింత మందికి అవకాశం
శిక్షణ పొందడానికి రూ.23,600 (జీఎస్‌టీ)తో కలిసి చెల్లించాలి. అంతమొత్తంలో చెల్లించాలంటే నిరుపేద నిరుద్యోగ యువతకు కష్టమవుతుందని పలువురి అభిప్రాయ పడుతున్నారు. గతంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ నిరుద్యోగ యువతకు కార్పొరేషన్ల ద్వారా ఉచితంగా శిక్షణ ఇచ్చేవారు. ప్రస్తుతం కృష్ణా జిల్లాలో సుగాలి, ఎరుకల (ఎస్టీ)లకు, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో బీసీ- బికి మాత్రమే ఉచిత శిక్షణ ఇస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చెందిన యువతకు అవకాశం కల్పించకపోవడం గమనార్హం. కృష్ణా జిల్లా తరహాలో తిరుపతి జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ నిరుద్యోగ యువతకు ఆయా కార్పొరేషన్ల ద్వారా చేయూతనిస్తే మరింత మందికి అవకాశం కలగనుంది.
డ్రైవింగ్‌పై శిక్షణ
తొలి మహిళా డ్రైవర్
శిక్షణలో హెవీ లైసెన్స్ పొందిన తొలి మహిళగా తిరుపతికి చెందిన పూర్ణిమ పేరు నమోదైంది. బీటెక్ మెకానికల్ ఇంజినీరింగ్ చేసిన ఆమె.. తోటి మహిళలకు ఆదర్శంగా నిలిచింది. గత ఏడాదిలో జరిగిన శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా నూతన విద్యుత్తు ఏసీ బస్సుల ప్రారంభోత్సవంలో విద్యుత్తు బస్సును నడిపి ఆర్టీసీ ఎండీ ద్వారక తిరుమలరావు ద్వారా ప్రశంసలు అందుకుంది.
నైపుణ్యం కలిగిన డ్రైవర్లకు డిమాండ్
- టి.రాము, హెవీ డ్రైవింగ్ స్కూల్ సమన్వయకర్త
ప్రస్తుతం హెవీ డ్రైవర్లకు అధిక డిమాండ్ ఉంది. అందుకు తగ్గట్టు నైపుణ్యం కలిగిన డ్రైవర్లు లేరు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ ద్వారా అందిస్తున్న నైపుణ్యంతో కూడిన హెవీ డ్రైవింగ్ శిక్షణ యువత సద్వినియోగం చేసుకోవాలి. ప్రస్తుతం 20వ బ్యాచ్‌కు సంబంధించి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నాం. వివరాలకు 73828 82441 చరవాణి నంబరు ద్వారా పేర్లు నమోదు చేసుకోవచ్చు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
IPL 2023 : కోట్లు పెట్టి కొన్నా.. కొట్టింది కొందరే..
-
Crime News
Hyderabad: సోదరి నైటీలో వచ్చి చోరీ.. బెడిసి కొట్టిన సెక్యూరిటీ గార్డ్ ప్లాన్
-
General News
Top Ten News @ 5PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Politics News
Kiran Kumar Reddy: నాకున్న అనుభవంతో భాజపా బలోపేతానికి కృషి చేస్తా: కిరణ్ కుమార్ రెడ్డి
-
Crime News
Prakasam: అప్పుడే పుట్టిన శిశువును సంచిలో కట్టి.. గిద్దలూరులో అమానుషం!
-
Sports News
IPL Playoffs: ఒక్కో డాట్ బాల్‌కు 500 మొక్కలు.. మొత్తం ఎన్ని మొక్కలు నాటబోతున్నారంటే?