logo

ఉద్యోగం పేరుతో నగదు కాజేత

దిల్లీకి చెందిన సైబర్‌ క్రైమ్‌ మోసగాడు శాంతిపురం మండల పరిధిలోని ఓ అమాయకురాలికి ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి.. ఆమె బ్యాంకు ఖాతా నుంచి నగదు కాజేసిన ఉదంతంపై నమోదు చేసిన

Published : 30 Mar 2023 02:23 IST

నిందితుడిని అరెస్టు చూపుతున్న ఎస్సై మునిస్వామి, సిబ్బంది

శాంతిపురం, న్యూస్‌టుడే: దిల్లీకి చెందిన సైబర్‌ క్రైమ్‌ మోసగాడు శాంతిపురం మండల పరిధిలోని ఓ అమాయకురాలికి ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి.. ఆమె బ్యాంకు ఖాతా నుంచి నగదు కాజేసిన ఉదంతంపై నమోదు చేసిన కేసులో నిందితుణ్ని రాళ్లబూదుగూరు పోలీసులు అరెస్టు చేశారు. ఎస్సై డి.మునిస్వామి బుధవారం విలేకరులకు తెలిపిన వివరాల మేరకు.. శివకురుబూరుకు చెందిన అమరావతి చరవాణికి గత ఏడాది నవంబరు 9న గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్‌ చేసి ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించారు. బ్యాంకు ఖాతా వివరాలు పంపమని సూచించారు. యూపీఐ లింక్‌లను పంపి.. ఆమె ఖాతాలోని రూ.1,73,000 కాజేశారు. మోసపోయానని గ్రహించిన బాధితురాలు రాళ్లబూదుగూరు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టగా మోసగాడు దిల్లీ వాసిగా గుర్తించారు. రాళ్లబూదుగూరు, గుడుపల్లె ఎస్సైలు మునిస్వామి, రామాంజినేయులు సిబ్బంది బృందంగా ఏర్పడి దిల్లీ వెళ్లి విచారణ చేపట్టారు. నార్త్‌వెస్ట్‌ దిల్లీలోని మోడల్‌ టౌన్‌కు చెందిన నిందితుడు మోనును అరెస్టు చేసి.. బుధవారం కుప్పం కోర్టులో హాజరుపరిచిన అనంతరం రిమాండుకు తరలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని