logo

గిరిజనుల సమస్యల పరిష్కారానికి చర్యలు

గిరిజనుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎస్టీ కమిషన్‌ సభ్యుడు శంకర్‌నాయక్‌ అన్నారు. మండలంలోని ధర్మచాట్ల వారి కండ్రిగ, గుండ్ల సముద్రం ఎస్టీ కాలనీని గురువారం ఆయన సందర్శించారు.

Published : 31 Mar 2023 02:32 IST

గృహ నిర్మాణ సమస్యలపై చర్చిస్తున్న శంకర్‌నాయక్‌

వెంకటగిరి, న్యూస్‌టుడే : గిరిజనుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎస్టీ కమిషన్‌ సభ్యుడు శంకర్‌నాయక్‌ అన్నారు. మండలంలోని ధర్మచాట్ల వారి కండ్రిగ, గుండ్ల సముద్రం ఎస్టీ కాలనీని గురువారం ఆయన సందర్శించారు. ధర్మచాట్లవారి కండ్రిగ గ్రామంలో మూత్రపిండాల వ్యాధి బారినపడి ఎక్కువమంది చనిపోతున్నారని, పలువురు చికిత్స పొందుతున్నారని గ్రామస్థులు తెలిపారు. ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ విజయ్‌కుమార్‌ మాట్లాడుతూ నీటి పరీక్షలు చేశామని, పూర్తి నివేదిక రాగానే చర్యలు తీసుకుంటామన్నారు. గ్రామానికి చెందిన 13 ఏళ్ల చిన్నారి అరుణ తిరుపతిలో డయాలసిస్‌ పొందుతోందని, చిన్నారికి ఆధార్‌కార్డు లేక ఇబ్బందులు పడుతున్నామని, పలుమార్లు విన్నవించినా పట్టించుకోలేదని గ్రామస్థులు తెలిపారు. దాంతో ఆయన సచివాలయం సిబ్బంది, పంచాయతీ కార్యదర్శి, ఎంపీడీవోపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే చిన్నారికి ఆధార్‌కార్డు వచ్చేలా చర్యలు చేపట్టాలన్నారు. ఇంత మంది అనారోగ్యం బారిన పడుతుంటే శిబిరాలు ఏర్పాటు చేయరా అంటూ వైద్యాధికారిణి పల్లవిని ప్రశ్నించారు. అనంతరం గుండ్ల సముద్రం ఎస్టీకాలనీని ఆయన సందర్శించగా గ్రామస్థులు పాఠశాల, దారి ఏర్పాటు, చెరువు ఆక్రమణ అంశాన్ని ప్రస్తావించగా తహసీˆల్దారు పద్మావతి, ఏఈ సుబ్బారావుకు ఆయన సూచనలు చేశారు. యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పెంచలయ్య, రాష్ట్ర వర్కింగ్‌ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులు సుబ్బారావు, మల్లికార్జునరావు, మహిళా అధ్యక్షురాలు ఉష, అధికారులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని