logo

వైద్య పరిజ్ఞానాన్ని మెరుగుపరుచుకోండి

వైద్య విద్యా కార్యక్రమాల ద్వారా విద్యార్థులు వైద్య పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చని తిరువనంతపురం శ్రీ చిత్ర తిరునాల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ మెడికల్‌ సైన్సెస్‌ అండ్‌ టెక్నాలజీ సంచాలకులు డాక్టర్‌ సంజయ్‌

Published : 31 Mar 2023 02:32 IST

డాక్టర్‌ సంజయ్‌ బిహారిని సత్కరిస్తున్న స్విమ్స్‌ సంచాలకురాలు

తిరుపతి(స్విమ్స్‌), న్యూస్‌టుడే: వైద్య విద్యా కార్యక్రమాల ద్వారా విద్యార్థులు వైద్య పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చని తిరువనంతపురం శ్రీ చిత్ర తిరునాల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ మెడికల్‌ సైన్సెస్‌ అండ్‌ టెక్నాలజీ సంచాలకులు డాక్టర్‌ సంజయ్‌ బిహారి పేర్కొన్నారు. స్విమ్స్‌ న్యూరో సర్జరీ విభాగం ఆధ్వర్యంలో చెరుకూరి నరసింహం మరియు సుభద్రాదేవి 8వ ఛైర్‌ ఒరేషన్‌ కార్యక్రమాన్ని గురువారం స్విమ్స్‌ పద్మావతి ఆడిటోరియంలో నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ సంజయ్‌ బిహారిని సత్కరించి బంగారు పతకం అందజేశారు. బయో ఎథిక్స్‌ ఇన్‌ మెడిసిన్‌ అనే అంశంపై పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా వివరించారు. కార్యక్రమంలో స్విమ్స్‌ సంచాలకులు డాక్టర్‌ భూమా వెంగమ్మ, ప్రిన్సిపల్‌ డాక్టర్‌ శరణ్‌ సింగ్‌, ఎంఎస్‌ డాక్టర్‌ రామ్‌, న్యూరో సర్జరీ విభాగాధిపతి డాక్టర్‌ వి.వి.రమేష్‌ చంద్ర తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని