logo

‘కాయ’కష్టం.. నేలపాలు

శాంతిపురం మండలంలో ఒబ్బిడి చేయకపోవడంతో నేలరాలి కుళ్లిపోతున్న టమోటాలు ఇవి. జిల్లాలోని పశ్చిమ మండలాల్లో విరగపండిన టమోటాలకు గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతుల పరిస్థితి దిక్కుతోచని విధంగా మారింది.

Published : 01 Apr 2023 03:09 IST

శాంతిపురం మండలంలో ఒబ్బిడి చేయకపోవడంతో నేలరాలి కుళ్లిపోతున్న టమోటాలు ఇవి. జిల్లాలోని పశ్చిమ మండలాల్లో విరగపండిన టమోటాలకు గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతుల పరిస్థితి దిక్కుతోచని విధంగా మారింది. వేసవిలో ఆశించిన ధరలు లభిస్తాయన్న గంపెడు ఆశతో రూ.లక్షలు వెచ్చించి సాగు చేసిన టమోటాకు కనీస మద్దతు ధర లభించని దుస్థితి దాపురించింది. నెల నుంచి ధరలు కనీస స్థాయికి పడిపోవడంతో టమోటాలను ఒబ్బిడి చేసినా కోత కూలి కూడా చేతికందని పరిస్థితి అన్నదాతలకు ఎదురవుతోంది. స్థానిక మార్కెట్‌లలో కిలో టమోటాలకు రూ.5 కూడా లభించకపోవడంతో చాలా చోట్ల తోటల్లోనే పండుబారిన టమోటాలు నేలరాలి కుళ్లిపోతున్నాయి.

న్యూస్‌టుడే, కుప్పం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని