logo

ఇంట్లో దూరింది నిజమే..

జడ్పీ నోడల్‌ అధికారి బాలాజీ ఇంట్లోకి.. బైరెడ్డిపల్లె ఇన్‌ఛార్జి ఎంపీడీవో రాజేష్‌, ఏవో రాజేంద్రతో కలిసి చొరబడి పరిశీలించింది వాస్తమేనని నిర్ధారణ అయింది. పూర్వ అధికారికి అత్యంత సన్నిహితంగా ఉంటున్న ఓ జిల్లా అధికారి దీనిపై  ఆరా తీసినట్లు సమాచారం.

Published : 18 Apr 2024 02:30 IST

పూర్వ అధికారి చెబితేనే వెళ్లా
ఉన్నతాధికారులకు రాజేష్‌ వివరణ
 

చిత్తూరు జడ్పీ, న్యూస్‌టుడే: జడ్పీ నోడల్‌ అధికారి బాలాజీ ఇంట్లోకి.. బైరెడ్డిపల్లె ఇన్‌ఛార్జి ఎంపీడీవో రాజేష్‌, ఏవో రాజేంద్రతో కలిసి చొరబడి పరిశీలించింది వాస్తమేనని నిర్ధారణ అయింది. పూర్వ అధికారికి అత్యంత సన్నిహితంగా ఉంటున్న ఓ జిల్లా అధికారి దీనిపై  ఆరా తీసినట్లు సమాచారం. ఇన్‌ఛార్జి ఎంపీడీవో రాజేష్‌, నోడల్‌ అధికారి బాలాజీలతో వేర్వేరుగా ఆయన మాట్లాడినట్లు తెలిసింది. తాను ఇంట్లో లేని సమయంలో బైరెడ్డిపల్లె ఎంపీడీవో తన ఇంటికొచ్చి సోదాలు చేసినది వాస్తవమేనని, తన భార్య అతడిని నిలదీసిన విషయమూ నిజమేనని ఆయన సదరు జిల్లా అధికారితో చెప్పినట్లు సమాచారం. పూర్వ అధికారి ఆదేశాల మేరకు తాను వెళ్లిన మాట వాస్తవమేనని, ఆయనకు ఆరోగ్యం బాగోలేదని చూసి రమ్మనడంతోనే వెళ్లాల్సి వచ్చిందని ఎంపీడీవో రాజేష్‌ అంగీకరించాడని సమాచారం. బాలాజీ నివాసంలో ఆయన కోసం వెతుకుతూ వాట్సప్‌ వీడియో కాల్‌ చేసి మరీ పూర్వ అధికారికి.. ఎంపీడీవో రాజేష్‌ చూపించాడని, అతడు అక్కడ లేడని నిర్ధరించుకున్నట్లు సమాచారం. ఇలా అధికారుల ఇళ్లలో చొరబడటంపై ఉద్యోగ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పూర్వ అధికారికి రాజకీయ పలుకుబడి ఉండటంతో ఎవరికివారు మిన్నకుంటున్నారని చర్చించుకుంటున్నాయి.

బాలాజీ రిలీవ్‌.. జడ్పీ నోడల్‌ అధికారి, అన్నమయ్య జిల్లా పీటీఎం ఎంపీడీవో బాలాజీ ఇక్కడి నుంచి బుధవారం రిలీవ్‌ అయ్యారు. ఈ మేరకు ఉత్తర్వులు తీసుకుని ఆయన నెల్లూరు వెళ్లారు. పూర్వ అధికారి, ఉద్యోగ విరమణ చేసిన అధికారి కేసు విచారణ ముగియడంతో రిలీవ్‌ చేసినట్లు తెలిసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని