logo

సమష్టి కృషితో సమగ్రాభివృద్ధి

జిల్లా సమగ్ర అభివృద్ధికి సమష్టిగా కృషి చేద్దామని జడ్పీ ఛైర్మన్‌ వేణుగోపాలరావు పిలుపునిచ్చారు. కాకినాడలోని జడ్పీ సమావేశ మందిరంలో శుక్రవారం జడ్పీ స్థాయీ సంఘాల సమావేశాలు నిర్వహించారు. నాలుగు సంఘాలకు జడ్పీ ఛైర్మన్‌ వేణుగోపాలరావు,

Published : 22 Jan 2022 05:23 IST


ప్రసంగిస్తున్న ఛైర్మన్‌ వేణుగోపాలరావు, వేదికపై వైస్‌ఛైర్మన్లు, అధికారులు

కాకినాడ నగరం: జిల్లా సమగ్ర అభివృద్ధికి సమష్టిగా కృషి చేద్దామని జడ్పీ ఛైర్మన్‌ వేణుగోపాలరావు పిలుపునిచ్చారు. కాకినాడలోని జడ్పీ సమావేశ మందిరంలో శుక్రవారం జడ్పీ స్థాయీ సంఘాల సమావేశాలు నిర్వహించారు. నాలుగు సంఘాలకు జడ్పీ ఛైర్మన్‌ వేణుగోపాలరావు, మిగతా మూడింటికి జడ్పీ వైస్‌ ఛైర్మన్‌-1 బుర్రా అనుబాబు, వైస్‌ ఛైర్మన్‌-2 మేరుగు పద్మలత, జడ్పీటీసీ సభ్యురాలు రొంగలి పద్మావతి అధ్యక్షత వహించారు. ఆర్థిక, ప్రణాళిక, గ్రామీణాభివృద్ధి, విద్య, వైద్యానికి సంబంధించిన సంఘాలకు అధ్యక్షత వహించిన జడ్పీ ఛైర్మన్‌ వేణుగోపాలరావు మాట్లాడుతూ గ్రామాభివృద్ధిలో కీలకమైన అంశాలపై అధికారులు దృష్టిపెట్టాలని కోరారు. వ్యవసాయంపై సాగిన చర్చలో తొలుత జేడీ విజయ్‌కుమార్‌ మాట్లాడుతూ జిల్లాలో 1.63 హెక్లార్లకు సంబంధించి తూర్పు డెల్టాలో 88 వేల హెక్లార్లు, మెట్టలో 38 వేల హెక్టార్లలో నాట్లు వేశారన్నారు. సెంట్రల్‌ డెల్టాలో 37వేల హెక్టార్లకు 14వేల హెక్టార్లలో నాట్లు వేయాల్సి ఉందన్నారు. ఇక్కడ నీటి ఎద్దటి కారణంగా జాప్యం జరిగిందని జేడీ వివరించారు. దీనిపై స్పందించిన జడ్పీ చైర్మన్‌ జిల్లాలో నీటి ఎద్దటి పరిస్థితి ఉండకూడదని, ప్రతి ఎకరాకూ సాగునీరు అందిస్తామన్నారు. జడ్పీస్థాయి సంఘాల సమావేశానికి సభ్యులుగా ఉన్న జిల్లా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అధిక శాతం హాజరు కాలేదు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో ఎన్‌వీవీ సత్యనారాయణ, గ్రామీణ నీటిసరఫరా విభాగ ఎస్‌ఈ ఎం.శ్రీనివాస్‌, డీఆర్‌డీఏ పీడీ శ్రీరమణి, డ్వామా పీడీ వెంకటలక్ష్మి, గృహనిర్మాణ శాఖ పీడీ సుధాకర్‌ పట్నాయక్‌, డీఈవో అబ్రహం, వ్యవసాయ శాఖ డీడీ మాధవరావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని