logo

ఏఐజీ నర్సు ఆత్మహత్య

ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆప్‌ గ్యాస్ట్రో ఎంటరాలజీలో (ఏఐజీ) పనిజేస్తోన్న నర్సు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. గచ్చిబౌలి ఇన్‌స్పెక్టర్‌ సురేష్‌ కథనం ప్రకారం.. కాకినాడకు చెందిన యువతి (27) కొంతకాలం క్రితం తన అక్క, తమ్ముడితో కలి

Published : 23 Jan 2022 03:36 IST

రాయదుర్గం: ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆప్‌ గ్యాస్ట్రో ఎంటరాలజీలో (ఏఐజీ) పనిజేస్తోన్న నర్సు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. గచ్చిబౌలి ఇన్‌స్పెక్టర్‌ సురేష్‌ కథనం ప్రకారం.. కాకినాడకు చెందిన యువతి (27) కొంతకాలం క్రితం తన అక్క, తమ్ముడితో కలిసి నగరానికి వచ్చి కొండాపూర్‌లో ఉంటూ ఏఐజీ నర్సుగా పని చేస్తోంది. ఈ నెల 21న అక్క, తమ్ముడు బయటికి వెళ్లారు. రాత్రి 8 గంటలకు అక్క ఇంటికి రాగా లోపలి నుంచి గడియవేసి ఉంది. కిటికీ తెరిచి చూడగా.. చున్నీతో ఫ్యాన్‌కు ఉరివేసుకుని వేలాడుతూ కనిపించింది. నిర్ఘాంతపోయిన ఆమె స్థానికుల సహాయంతో కింది దించి చూడగా యువతికి ఎడమ చేతికి బ్లేడుతో కోసుకున్న గాటు కనిపించింది. ఆ ప్రదేశంలో రక్తపు మరకలు ఉన్నాయి. వ్యక్తిగత సమస్యలతో ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు తమ్ముడు గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని