logo

వ్యసనాలకు బానిసలై.. దొంగలుగా మారి

వ్యసనాలకు బానిసలైన ముగ్గురు వ్యక్తులు విలాసాల కోసం మోటారు సైకిల్‌ దొంగలుగా మారి చివరకు పోలీసులకు చిక్కారు. రావులపాలెం పోలీసు స్టేషన్‌లో ఎస్సై భానుప్రసాద్‌ ఆధ్వర్యంలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఇన్‌ఛార్జి సీఐ బాజీలాల్‌ మాట్లాడుతూ.. రావులపాలెం, ఆలమూరు, కొత్తపేట,

Published : 27 Jan 2022 04:40 IST


మోటారు సైకిల్‌దొంగలతో పోలీసులు

రావులపాలెం పట్టణం: వ్యసనాలకు బానిసలైన ముగ్గురు వ్యక్తులు విలాసాల కోసం మోటారు సైకిల్‌ దొంగలుగా మారి చివరకు పోలీసులకు చిక్కారు. రావులపాలెం పోలీసు స్టేషన్‌లో ఎస్సై భానుప్రసాద్‌ ఆధ్వర్యంలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఇన్‌ఛార్జి సీఐ బాజీలాల్‌ మాట్లాడుతూ.. రావులపాలెం, ఆలమూరు, కొత్తపేట, అంగర, మలికిపురం పోలీసు స్టేషన్‌ల పరిధిలో 16 మోటారు సైకిల్‌ దొంగతనాలపై కేసులు నమోదవగా, దర్యాప్తులో ముగ్గురు ఉన్నట్లు గుర్తించామన్నారు. ఆలమూరు మండలం పెదపల్లకు చెందిన కంచెర్ల జార్జిటెన్ని, ఆలమూరుకు చెందిన గండేటి నరసింహ, రావులపాలెం మండలం వెదిరేశ్వరానికి చెందిన ఇళ్ల శ్రీనివాస్‌ కొన్ని సంవత్సరాలుగా చోరీలు చేస్తున్నారన్నారు. స్థానిక జూనియర్‌ కళాశాల వద్ద వాహనాల తనిఖీ చేస్తుండగా వీరిని అరెస్టు చేసినట్లు తెలిపారు. వీరి నుంచి 16 మోటారు సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. వీరిని రిమాండు నిమిత్తం కొత్తపేట కోర్టుకు తరలించినట్లు ఆయన పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని