logo

6 నుంచి కళా ఉత్సవ్‌ పోటీలు

జాతీయ స్థాయి కళా ఉత్సవ్‌కు జిల్లా స్ధాయి ఎంపిక పోటీలను పాఠశాల విద్య సంచాలకుని ఆదేశాల మేరకు దూబచర్ల డైట్‌ కళాశాలలో నిర్వహిస్తున్నామని ప్రిన్సిపల్‌ పీవీ రమణమూర్తి గురువారం తెలిపారు.

Published : 02 Dec 2022 05:16 IST

నల్లజర్ల, న్యూస్‌టుడే: జాతీయ స్థాయి కళా ఉత్సవ్‌కు జిల్లా స్ధాయి ఎంపిక పోటీలను పాఠశాల విద్య సంచాలకుని ఆదేశాల మేరకు దూబచర్ల డైట్‌ కళాశాలలో నిర్వహిస్తున్నామని ప్రిన్సిపల్‌ పీవీ రమణమూర్తి గురువారం తెలిపారు. ఈనెల 6న గాత్రంలో శాస్త్రీయ, జానపద సంగీతాలు, వాయిద్యాల్లో జానపద, శాస్త్రీయ వాయిద్యాలు, శాస్త్రీయ నృత్యాలు ఉంటాయన్నారు. 7న జానపద నృత్యాలు, చిత్రలేఖనం, శిల్పకళ, సంప్రదాయ బొమ్మలు, ఆటలు, ఏకపాత్రాభినయం నిర్వహిస్తున్నామని తెలిపారు.  ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన అన్ని ప్రభుత్వ, ప్రభుత్వేతర విద్యా సంస్ధలలో 9వతరగతి నుంచి 12 (ఇంటర్మీడియేట్‌) వరకూ చదువుతున్న విద్యార్ధిని విద్యార్ధులకు ఈ పోటీలు నిర్వహిస్తామన్నారు. ఏ విద్యార్టీ రెండేసి అంశాలలో పాల్గొనరాదని తెలిపారు. పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్స్‌ తమ విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొనేందుకు ప్రోత్సహించాలని, ఇతర  వివరాలకు నంబరు 9951817359కు సంప్రదించాలని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని