logo

బాధిత చిన్నారులకు ఆసరాగా నిలుద్దాం

హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌ మహమ్మారి బారినపడిన చిన్నారులకు ఆసరాగా నిలిచేందుకు దాతలు ముందుకురావాలని కలెక్టర్‌ హిమాన్షుశుక్లా పిలుపునిచ్చారు.

Published : 02 Dec 2022 05:16 IST

అమలాపురం కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌ మహమ్మారి బారినపడిన చిన్నారులకు ఆసరాగా నిలిచేందుకు దాతలు ముందుకురావాలని కలెక్టర్‌ హిమాన్షుశుక్లా పిలుపునిచ్చారు. ప్రపంచ ఎయిడ్స్‌ డే సందర్భంగా గురువారం కలెక్టరేట్‌లో వైద్యఆరోగ్యశాఖ, స్వచ్ఛంద సేవాసంస్థల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. బాధిత చిన్నారులకు ఆపన్నహస్తం అందించేందుకు ప్రతిఒక్కరూ సహకారం అందించాలని కలెక్టర్‌ తెలిపారు. జిల్లా వైద్యాధికారి భారతలక్ష్మి మాట్లాడుతూ కొన్నేళ్లుగా ఎయిడ్స్‌ వ్యాధిగ్రస్థుల సంఖ్య క్రమేపీ తగ్గుతోందని, జిల్లావ్యాప్తంగా గత ఏడు నెలల్లో 136 మంది ఈ వ్యాధి బారినపడినట్లు తెలిపారు. 6,174 మంది రోగులకు మందులు అందజేస్తున్నామన్నారు. అనంతరం కలెక్టర్‌, ఎస్పీ తదితరులు బాధిత చిన్నారులతో కలిసి భోజనాలు చేశారు. స్నేహిత స్వచ్ఛంద సేవాసంస్థతోపాటు, పలువురు దాతలు సమకూర్చిన పోషకాహార కిట్లను అందజేశారు. డీసీహెచ్‌ఎస్‌ పద్మశ్రీరాణి, వెంకటేశ్వర్లు, స్వర్ణలత, వెంకన్నాయుడు, లయన్స్‌క్లబ్‌ ప్రతినిధులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని