logo

పొగాకు క్యూరింగ్‌ పనులు వేగవంతం

మెట్ట ప్రాంతాల్లో వర్జీనియా పొగాకు సాగు ఆధారంగా వేలాది కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. సుమారు ఎనిమిది నెలల పాటు ఉండే ఈ పంట నాలుగు దశల్లో సాగుతుంది. నాట్లు, క్యూరింగ్‌, గ్రేడింగ్‌, అమ్మకాలు జరుగుతాయి.

Published : 30 Jan 2023 05:49 IST

ఏపుగా పెరిగిన వర్జీనియా పొగాకు తోట

గోపాలపురం, దేవరపల్లి: మెట్ట ప్రాంతాల్లో వర్జీనియా పొగాకు సాగు ఆధారంగా వేలాది కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. సుమారు ఎనిమిది నెలల పాటు ఉండే ఈ పంట నాలుగు దశల్లో సాగుతుంది. నాట్లు, క్యూరింగ్‌, గ్రేడింగ్‌, అమ్మకాలు జరుగుతాయి. ప్రస్తుతం క్యూరింగ్‌ దశకు చేరుకుంది. పొలంలో చెట్లకు ఉన్న ఆకులు రంగు వచ్చిన ఆకులను తీసుకొచ్చి బ్యారన్‌లో ఉంచుతారు. సుమారు 70 రోజుల పాటు ఈ ప్రక్రియ సాగుతుంది.  

లాభాదాయకం..

వర్జీనియా పొగాకు ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా ఉన్న అయిదు వేలం కేంద్రాల పరిధిలోని బీఎల్‌ఎస్‌, ఎన్‌ఎల్‌ఎస్‌ పరిధిలో 14,288 బ్యారన్‌కు గాను సుమారు 56,300 ఎకరాల్లో పొగాకు సాగు చేస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా పరిధిలో ఎన్‌ఎల్‌ఎస్‌ పొగాకు గోపాలపురం, దేవరపల్లి, తాళ్లపూడి, నల్లజర్ల, మండలాలతో పాటు బీఎల్‌ఎస్‌ పొగాకు తొర్రేడు పరిసర ప్రాంతాల్లో పండిస్తున్నారు.  

రైతులకు అవగాహన...

ఇప్పటికే ప్రతి బోర్డ్‌ పరిధిలో క్యూరింగ్‌ విషయంలో రైతులకు అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఏ సమయంలో ఆకు తీయాలి క్యూరింగ్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శాస్త్రవేత్తలు, పొగాకు కొనుగోలు సంస్థల ప్రతినిధులు రైతులకు వివరిస్తున్నారు. రసాయన ఎరువులు అధికంగా ఉపయోగించడం వల్ల కలిగే నష్టాలను రైతులకు వివరిస్తున్నారు. కేవలం పొగాకు బోర్డ్‌  సూచించిన ఎరువులు, పురుగు మందులు వినియోగించి నాణ్యమైన పంటలను అందించాలని అధికారులు సూచిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని