logo

త్రివేణి సంగమంలా కూటమి పార్టీలు పనిచేస్తాయి

రాష్ట్రంలో పార్లమెంట్‌, అసెంబ్లీ స్థానాలకు భాజపా అభ్యర్థులను కేంద్ర నాయకత్వం నిర్ణయించిందని, అధిష్ఠానం నిర్ణయాన్ని గౌరవించి కూటమి అభ్యర్థుల విజయానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, భాజపా ఏపీ ఎన్నికల సహబాధ్యుడు సిద్ధార్థ్‌నాథ్‌ సింగ్‌  శ్రేణులను కోరారు.

Published : 29 Mar 2024 03:06 IST

భాజపా సమావేశంలో పురందేశ్వరి, సిద్ధార్థ్‌నాథ్‌సింగ్‌

మాట్లాడుతున్న సిద్ధార్థ్‌నాథ్‌ సింగ్‌. చిత్రంలో పురందేశ్వరి, పార్టీ నేతలు

దేవీచౌక్‌ (రాజమహేంద్రవరం): రాష్ట్రంలో పార్లమెంట్‌, అసెంబ్లీ స్థానాలకు భాజపా అభ్యర్థులను కేంద్ర నాయకత్వం నిర్ణయించిందని, అధిష్ఠానం నిర్ణయాన్ని గౌరవించి కూటమి అభ్యర్థుల విజయానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, భాజపా ఏపీ ఎన్నికల సహబాధ్యుడు సిద్ధార్థ్‌నాథ్‌ సింగ్‌  శ్రేణులను కోరారు. త్రివేణి సంగమంలా మూడు పార్టీలు కలిసి పనిచేస్తాయన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గురువారం పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో పాల్గొన్న పురందేశ్వరి మాట్లాడుతూ..  అనపర్తిలో భాజపా జెండా ఎగరాలని పిలుపునిచ్చారు. భాజపా కార్యకర్తలు కేవలం మన అభ్యర్థి కోసమే కాకుండా.. తెదేపా, జనసేన అభ్యర్థులను గెలిపించాల్సిన బాధ్యత ఉందన్నారు. కూటమి రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, కూటమి అభ్యర్థులను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. ఇటీవల విజయవాడలో భాజపా, తెదేపా, జనసేన నాయకులు సమావేశమై వివిధ అంశాలపై చర్చించామన్నారు. ఏప్రిల్‌ 4న పార్లమెంట్‌, 8న అసెంబ్లీ స్థానాల పరిధి సమన్వయ కమిటీ సమావేశాలు జరపాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. సీనియర్లకు టికెట్లు ఇవ్వకపోవడం, అనపర్తి సీటు భాజపాకు కేటాయించడంపై విలేకరులు అడిగిన ప్రశ్నపై ఆమె మాట్లాడుతూ.. సమన్వయ కమిటీ సమావేశాల తర్వాత అన్ని సర్దుకుంటాయన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని