logo

పేపరుమిల్లు యాజమాన్యం మొండి వైఖరి విడనాడాలి

రాజమహేంద్రవరం పేపరుమిల్లు యాజమాన్యం మొండివైఖరి విడనాడి వేతన ఒప్పందం వెంటనే అమలు చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు టి.అరుణ్‌ డిమాండ్‌ చేశారు.

Published : 18 Apr 2024 06:16 IST

మాట్లాడుతున్న అరుణ్‌ తదితరులు

దేవీచౌక్‌: రాజమహేంద్రవరం పేపరుమిల్లు యాజమాన్యం మొండివైఖరి విడనాడి వేతన ఒప్పందం వెంటనే అమలు చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు టి.అరుణ్‌ డిమాండ్‌ చేశారు. బుధవారం ప్రెస్‌క్లబ్‌లో మిల్లు కార్మిక సంఘాలతో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కార్మికుల సమ్మె 17వ రోజుకు చేరుకుందన్నారు. రెండేళ్లకోసారి కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికలు, మూడున్నరేళ్లకోసారి వేతన ఒప్పందం చేసుకోవాల్సి ఉండగా గత 42 నెలలుగా పూర్తి భిన్నంగా వ్యవహరించిందని ధ్వజమెత్తారు. చివరి వేతన ఒప్పందం 2020 జూన్‌లో ముగిసినప్పటికీ ఇప్పటివరకు మళ్లీ చేయలేదన్నారు. ఈ నెల 12న జరిగిన చర్చల్లోనూ మొండిగా వ్యవహరించిదన్నారు. కార్మిక సంఘాల జేఏసీ జిల్లా కలెక్టరుకు విన్నవించుకోగా యాజమాన్యాన్ని చర్చలకు పిలిచారని, దానికి కూడా హాజరు కాలేదన్నారు. వేతన ఒప్పందం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఐఎన్‌టీయూసీ అధ్యక్షుడు జె.వై.దాసు, సీఐటీయూ అధ్యక్షుడు వెంకటేశ్వరరావు, ఏఐటీయూసీ కార్యదర్శి కృష్ణ, రాజేష్‌, మురళి, సుబ్రహ్మణ్యనాయుడు, సత్తిరాజు, శ్రీనివాసరెడ్డి, వీరబాబు, హరిబాబు, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని