logo

వైకాపా గొప్పలు.. రైతుకు తిప్పలు

మాది రైతుల ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకొంటున్న వైకాపా పాలనలో కర్షకులు అనుభవిస్తున్న అవస్థలకు ఈ చిత్రమే నిదర్శనం. కట్టిస్తామన్న గోదాములు నిర్మించక, కనీసం కళ్లాలకూ స్థలాలు చూపకపోవడంతో రైతులు ధాన్యం ఆరబోసుకునేందుకు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు.

Published : 24 Apr 2024 06:19 IST

మాది రైతుల ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకొంటున్న వైకాపా పాలనలో కర్షకులు అనుభవిస్తున్న అవస్థలకు ఈ చిత్రమే నిదర్శనం. కట్టిస్తామన్న గోదాములు నిర్మించక, కనీసం కళ్లాలకూ స్థలాలు చూపకపోవడంతో రైతులు ధాన్యం ఆరబోసుకునేందుకు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. ఈ క్రమంలోనే సీతానగరం మండలంలోని వంగలపూడిలో రైతులు మంగళవారం శ్మశానంలో ధాన్యం ఆరబోశారు. ‘ఆర్బీకేల్లో ధాన్యం పోసుకునే స్థలాలు ఉండటం లేదు. ధాన్యం తీసుకెళ్లేందుకు వాహనాలూ పంపడం లేదు. వాహనాల అద్దె ఖర్చూ మేమే భరించాల్సి వస్తోంది. తీరా ఆర్బీకేలకు తీసుకెళ్తే తేమ శాతంపై కొర్రీలు పెట్టి.. వెనక్కి పంపుతున్నారు. అందుకే ముందుగానే ఖాళీ స్థలాలు ఎక్కడుంటే అక్కడే ఇలా ఆరబోసుకోవాల్సి వస్తోంది’ అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

న్యూస్‌టుడే, సీతానగరం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు