logo

ప్రభుత్వ ఉద్యోగుల నిరసన హోరు

పీఆర్‌సీ జీవోను రద్దు చేసి తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బుధవారం మండలవ్యాప్తంగా ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగులు, పొరుగుసేవల, ఒప్పంద, పింఛనుదారులు నిరసనలో పాల్గొన్నారు. గుళ్లపల్లి, కనగాల, రాజోలు తదితర ప్రాంతాల నుంచి ఉపాధ్యాయులు,

Published : 27 Jan 2022 02:27 IST


నినాదాలు చేస్తున్న సాధన సమితి సభ్యులు

చెరుకుపల్లి గ్రామీణ, న్యూస్‌టుడే : పీఆర్‌సీ జీవోను రద్దు చేసి తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బుధవారం మండలవ్యాప్తంగా ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగులు, పొరుగుసేవల, ఒప్పంద, పింఛనుదారులు నిరసనలో పాల్గొన్నారు. గుళ్లపల్లి, కనగాల, రాజోలు తదితర ప్రాంతాల నుంచి ఉపాధ్యాయులు, ఉద్యోగులు ప్రదర్శనగా చెరుకుపల్లికి చేరుకున్నారు. తొలుత సంతబజారు వద్ద గాంధీ విగ్రహానికి పూలమాల వేసి వినతిపత్రం అందించారు. ప్రదర్శగా ఐలాండ్‌ కూడలికి చేరుకుని అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అంతా కలసి మానవహారంగా ఏర్పడి నిరసన తెలిపారు. దీంతో ఐలాండ్‌ సెంటర్‌ వద్ద తెనాలి, రేపల్లె, బాపట్ల వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి.
‘ఉద్యోగుల్ని మోసం చేసిన రాష్ట్ర ప్రభుత్వం’ 
రేపల్లె, న్యూస్‌టుడే : రాష్ట్ర ప్రభుత్వం మోసపూరిత పీఆర్సీ ఇచ్చి ఉద్యోగుల్ని మోసం చేసిందని పీఆర్సీ సాధన సమితి రేపల్లె ప్రాంత కన్వీనర్‌ ఏపీ ఎన్జీవో నేత కె.గంగాధర్‌రావు విమర్శించారు. పీఆర్సీలో అన్యాయం జరిగిందని పేర్కొంటూ నిరసన వ్యక్తం చేయాలన్న రాష్ట్ర పీఆర్సీ సాధన కమిటీ పిలుపు మేరకు బుధవారం పట్టణంలో ప్రదర్శన నిర్వహించి అంబేద్కర్‌ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. అనంతరం ర్యాలీగా వచ్చి అంబేడ్కర్‌ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో యూటీఎఫ్‌ జిల్లా కార్యదర్శి ఎంబీ సుబ్రహ్మణ్యం, ఏపీటీఎఫ్‌ రాష్ట్ర ప్రధానకార్యదర్శి పి.వరప్రసాద్, గ్రామ సచివాలయ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు కె.అనూరాధ, వివిధ ఉపాధ్యాయ సంఘాల నేతలు టి.శ్రీనివాసరావు, జి.నాంచారయ్య, ఎ.రాంబాబు, పింఛనుదారుల సంఘం నాయకుడు జి.రాజారత్నం, సీఐటీయూ డివిజన్‌ కార్యదర్శి సీహెచ్‌ మణిలాల్, ఏఐటీయూసీ రేపల్లె అధ్యక్షుడు కె.రమేష్, రాజభూషణం, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని