logo

కళాశాల దశలోనే నైపుణ్యాలు పెంచుకోవాలి

రానున్న ఐదేళ్లలో 5జీ, ఐవోటీ సాంకేతిక పరిజ్ఞానం ప్రపంచాన్ని నడిపిస్తుందని కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ మంత్రిత్వ శాఖకు చెందిన విద్యుత్‌ అయస్కాంత పరిశోధన, అభివృద్ధి సంస్థ చెన్నై ఉప సంచాలకుడు, సీనియర్‌ శాస్త్రవేత్త బాలకృష్ణ పేర్కొన్నారు.

Published : 03 Jul 2022 06:26 IST

ప్రపంచాన్ని నడిపించేది ఐవోటీ పరిజ్ఞానమే
సీనియర్‌ శాస్త్రవేత్త బాలకృష్ణ


శాస్త్రవేత్త బాలకృష్ణను సత్కరిస్తున్న బీఈఎస్‌ అధ్యక్షుడు ముప్పలనేని శ్రీనివాసరావు, చిత్రంలో అధ్యాపకులు, విద్యార్థినులు

బాపట్ల, న్యూస్‌టుడే : రానున్న ఐదేళ్లలో 5జీ, ఐవోటీ సాంకేతిక పరిజ్ఞానం ప్రపంచాన్ని నడిపిస్తుందని కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ మంత్రిత్వ శాఖకు చెందిన విద్యుత్‌ అయస్కాంత పరిశోధన, అభివృద్ధి సంస్థ చెన్నై ఉప సంచాలకుడు, సీనియర్‌ శాస్త్రవేత్త బాలకృష్ణ పేర్కొన్నారు. బాపట్ల మహిళా ఇంజినీరింగ్‌ కళాశాలలో విద్యార్థినులతో శనివారం నిర్వహించిన ముఖాముఖిలో ఆయన మాట్లాడారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో విప్లవాత్మక మార్పులు వచ్చి రిమోట్ సాంకేతికతతో అన్ని పరికరాలు పనిచేస్తాయన్నారు. ప్రతిభావంతులైన యువ ఇంజినీర్లు అమెరికా వెళ్లకుండా మన దేశంలో ఉండి నూతన ఆవిష్కరణలు సాధించాలని సూచించారు. విద్యార్థులు కళాశాల దశలోనే పరిశోధనా నైపుణ్యాలు పెంచుకోవాలన్నారు. బీటెక్‌, ఎంటెక్‌, బీఎస్సీ, ఎమ్మెస్సీ విద్యార్థులు ఆసక్తితో ముందుకొస్తే తమ పరిశోధనా సంస్థలో పారిశ్రామిక శిక్షణ ఇస్తామని చెప్పారు. ఈసీఈ విద్యార్థినులు మౌనిక, సువర్ణ, ప్రవల్లిక, అక్షయ, దివ్య మేఘన ఎనిమిది నెలలు కష్టపడి పనిచేసి శత్రు రాడార్లకు యుద్ధ విమానాలు చిక్కకుండా ఉండేలా స్టెల్త్‌ టెక్నాలజీలో ఆధునిక ఆర్‌ఎఫ్‌ క్లాకింగ్‌ సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై సాఫ్ట్‌వేర్‌ డిజైన్‌ చేసి పేటెంట్ పొందడం అభినందనీయమన్నారు. విద్యార్థినుల ప్రాజెక్టు విజయవంతానికి సహాయక ఆచార్యురాలు గూడపాటి దివ్య ఎంతో శ్రమించారని పేర్కొన్నారు. బాపట్ల ఎడ్యుకేషన్‌ సొసైటీ అధ్యక్షుడు ముప్పలనేని శ్రీనివాసరావు మాట్లాడారు. అనంతరం శాస్త్రవేత్త బాలకృష్ణను సత్కరించారు. బాపట్ల ఎడ్యుకేషన్‌ సొసైటీ కార్యదర్శి మానం నాగేశ్వరరావు, సంయుక్త కార్యదర్శి కొమ్మినేని హరిపద్మప్రసాద్‌, ఉపాధ్యక్షుడు గెల్లి దిలీప్‌కుమార్‌, ఫార్మసీ కళాశాల ప్రిన్సిపల్‌ తలశిల ఈశ్వర గోపాలకృష్ణమూర్తి, ఇంజినీరింగ్‌ కళాశాల ప్రిన్సిపల్‌ హరిత పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని