logo

అద్దంకిలో రెండిళ్లలో చోరీ

అద్దంకిలో తాళం వేసిన రెండు ఇళ్లల్లº దొంగతనం జరిగింది. ఈ సంఘటన శుక్రవారం రాత్రి చోటు చేసుకోగా శనివారం రాత్రి వెలుగు చూసింది. పోలీసులు అందించిన సమాచారం మేరకు.. జె.పంగులూరు మండలం అలవలపాడు గ్రామానికి చెందిన కలవకూరి ఆంజనేయులు

Updated : 03 Jul 2022 08:19 IST

నగదు, బంగారం, వెండి వస్తువుల అపహరణ


విశ్వభారతినగర్‌ వద్ద ఇంట్లో చిందరవందరగా పడేసిన వస్తువులు

అద్దంకి, న్యూస్‌టుడే: అద్దంకిలో తాళం వేసిన రెండు ఇళ్లల్లº దొంగతనం జరిగింది. ఈ సంఘటన శుక్రవారం రాత్రి చోటు చేసుకోగా శనివారం రాత్రి వెలుగు చూసింది. పోలీసులు అందించిన సమాచారం మేరకు.. జె.పంగులూరు మండలం అలవలపాడు గ్రామానికి చెందిన కలవకూరి ఆంజనేయులు విశ్వభారతినగర్‌లో సొంతిల్లు కట్టుకుని, నివసిస్తున్నారు. శుక్రవారం ఉదయం బాపట్ల వెళ్లిన దంపతులు శనివారం రాత్రి ఎనిమిది గంటలకు ఇల్లు చేరారు. ప్రహరీకి వేసిన తాళం అలాగే ఉంది. లోపల పరిశీలించగా ఇంటి తలుపులు తెరిచి, ఇల్లంతా చిందరవందరగా ఉంది. బీరువాలోని చీరలు, ఇతర వస్తువులు కిందపడేసి ఉన్నాయి. దీంతో కంగారుపడిన యజమాని పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్సై కె.కమలాకర్‌ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. దొంగలు ఇంట్లోకి ప్రవేశించే మార్గం, బైటకు వెళ్లిన మార్గాల గురించి చూశారు. డాగ్‌స్క్వాడ్‌, వేలిముద్ర నిపుణులు వచ్చేంత వరకు ఇతరులు ఎవరూ ఇంట్లోకి ప్రవేశించకుండా చూడాలని యజమానులకు సూచించారు.

తిరుమల వెళ్లిన వారి ఇంట్లో..

పట్టణంలోని అభ్యుదయనగర్‌లో మరో దొంగతనం శనివారం సాయంత్రం వెలుగు చూసింది. నంబూరిపాలెం వెళ్లేదారిలో నివసించే చల్లగుండ్ల హరిబాబు కుటుంబ సభ్యులు శుక్రవారం ఉదయం తిరుమల వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు వస్తువులు చిందరవందరగా పడేశారు. సాయంత్రం ఇంటి పరిసరాల్లో చిన్నపిల్లలు ఆడుకుంటూ ఇంట్లోకి చూడగా తలుపులు తీసి ఉన్నాయి. అనుమానం కలిగి యజమానులకు సమాచారం ఇవ్వడంతో ఇల్లంతా చరవాణి వీడియో కాల్‌ ద్వారా చూశారు. దీంతో ఇంట్లో చోరీ జరిగిందని భావించిన హరిబాబు తిరుమల నుంచి బయల్దేరినట్లు చెప్పారు. ఆదివారం పూర్తిగా పరిశీలించి పోలీసులకు ఫిర్యాదు చేస్తానన్నారు. ఇంట్లో బంగారం, వెండి, నగదు ఉంచినట్లు హరిబాబు ‘న్యూస్‌టుడే’కు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని