logo

‘జీవో 117 రద్దుకు డిమాండ్‌’

గుంటూరు నగరంలోని హిందూ కళాశాల, టీజేసీఎస్‌ కళాశాల వద్ద ఏఐఎస్‌ఎఫ్‌ 87వ ఆవిర్భావ దినోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా కార్యదర్శి నాసర్‌జీ, అధ్యక్షుడు చైతన్యల ఆధ్వర్యంలో..

Published : 13 Aug 2022 06:19 IST


హిందూ కళాశాల వద్ద ఏఐఎస్‌ఎఫ్‌ ఆవిర్భావ దినోత్సవంలో నాయకులు అరుణ్‌కుమార్‌, రమణ, నాసర్‌జీ, చైతన్య

నెహ్రూనగర్‌, న్యూస్‌టుడే: గుంటూరు నగరంలోని హిందూ కళాశాల, టీజేసీఎస్‌ కళాశాల వద్ద ఏఐఎస్‌ఎఫ్‌ 87వ ఆవిర్భావ దినోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా కార్యదర్శి నాసర్‌జీ, అధ్యక్షుడు చైతన్యల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి మాజీ నాయకులు అరుణ్‌కుమార్‌, రమణ ముఖ్య అతిథులుగా హాజరై జెండా ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా కార్యదర్శి బందెల నాసర్‌జీ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన జాతీయ విద్యావిధానాన్ని భాజపా పాలిత రాష్ట్రాల్లో ప్రవేశపెట్టలేదన్నారు. ఏపీలో మాత్రం సీఎం జగన్‌మోహన్‌రెడ్డి మోదీ మెప్పు కోసం ప్రవేశపెట్టి విద్యార్థులకు విద్యను దూరం చేసేవిధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. 3, 4, 5 తరగతులు విలీనంతో లక్షల మంది గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు విద్యకు దూరమవుతున్నారన్నారు. ఇప్పటికైనా రాష్ట్రప్రభుత్వం ప్రవేశపెట్టిన జీవో నంబర్‌ 117ను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. సాంఘిక సంక్షేమ హాస్టళ్లల్లో వసతులు కల్పించాలని, పేద విద్యార్థులకు న్యాయం చేసేవిధంగా చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్త బంద్‌కు పిలుపునిస్తామని హెచ్చరించారు. జిల్లా అధ్యక్షుడు జంగాల చైతన్య, నగర కార్యదర్శి శశి, నాయకులు సాయి, అమరనాథ్‌, శ్రీహరి, మోహిస్‌, మనోహర్‌, కిశోర్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని