logo

భూముల రీసర్వే చరిత్రాత్మకం: మంత్రి అంబటి

వందేళ్ల క్రితం నాటి భూ రికార్డులను సమూలంగా ఆధునికీకరించే రీసర్వే కార్యక్రమం చరిత్రాత్మకమని మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు.

Published : 07 Dec 2022 04:21 IST

భూ హక్కు పత్రాలు పంపిణీ చేస్తున్న మంత్రి అంబటి, ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు తదితరులు

నరసరావుపేట అర్బన్‌, న్యూస్‌టుడే: వందేళ్ల క్రితం నాటి భూ రికార్డులను సమూలంగా ఆధునికీకరించే రీసర్వే కార్యక్రమం చరిత్రాత్మకమని మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. భువనచంద్ర టౌన్‌హాల్‌లో మంగళవారం జిల్లాలో రీసర్వే పూర్తి చేసిన గ్రామాల రైతులకు వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పత్రాల కార్యక్రమాన్ని నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ సీఎం జగన్‌ రూ.1000 కోట్లు వెచ్చించి పూర్తి రీసర్వే చేయడంతో భూ వివాదాలు పరిష్కారం అవుతాయన్నారు. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ రీసర్వేలో రైతులకు సమస్యలు ఉంటే వాటిని నిర్ణీత గడువులోగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌, జేసీలకు సూచించారు. కలెక్టర్‌ శివశంకర్‌ మాట్లాడుతూ 80 గ్రామాల్లో రీసర్వే ప్రారంభం కాగా వాటిల్లో 70 గ్రామాల్లో పక్రియ పూర్తి చేశామన్నారు. జిల్లాలో 13.66 లక్షల ఎకరాల భూమి ఉంటే వాటిలో ఇప్పటికే 4.5లక్షల ఎకరాల సర్వే చేసినట్లు పేర్కొన్నారు. 33 గ్రామాలకు సంబంధించి 1.98లక్షల మంది రైతులకు భూహక్కు పత్రాలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వవిప్‌ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యేలు గోపిరెడ్డి, శ్రీనివాసరెడ్డి, కాసు మహేష్‌రెడ్డి, నంబూరి శంకరరావు, జేసీ శ్యాంప్రసాద్‌, ఆర్డీవోలు శేషిరెడ్డి, రాజకుమరి, అద్దయ్య, డీఆర్వో వినాయకం, ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్‌ వసంత్‌, సర్వేశాఖ సహాయ సంచాలకులు నాగశేఖర్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని