logo

దరఖాస్తు గడువు దాటితే రోజుకు రూ.100 జరిమానా

గ్రామ, వార్డు సచివాలయం, ఏపీ సేవ, మీసేవ ద్వారా వచ్చిన దరఖాస్తులు గడువు లోపు పరిష్కరించకపోతే రోజుకు రూ.100 జరిమానా విధించనున్నట్లు గుంటూరు కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు

Published : 21 Mar 2023 05:45 IST

గుంటూరు: గ్రామ, వార్డు సచివాలయం, ఏపీ సేవ, మీసేవ ద్వారా వచ్చిన దరఖాస్తులు గడువు లోపు పరిష్కరించకపోతే రోజుకు రూ.100 జరిమానా విధించనున్నట్లు గుంటూరు కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. గడువు లోగా దరఖాస్తులను పూర్తి చేయాలని, లేకపోతే గడువు దాటిన ప్రతి దరఖాస్తుకు రోజుకు రూ.100 చొప్పున పరిష్కరించే వరకు జరిమానా విధించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇందుకుగాను ప్రత్యేక ఖాతాను తెరవాలని ప్రత్యేక ఉప కలెక్టర్‌ను ఆదేశిస్తూ ఉత్తర్వులో పేర్కొన్నారు. జరిమానాలకు సంబంధించి రికార్డును సక్రమంగా నివేదించాలని ఉత్తర్వుల్లో సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని