logo

‘జగన్‌ను ఓడించి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి’

రాష్ట్రంలో ఫాసిస్ట్‌ పాలన కొనసాగిస్తున్న జగన్‌ను ఓడించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని మాల మహా సభ వ్యవస్థాపక అధ్యక్షుడు మెల్లెల వెంకట్రావు కోరారు. రిపబ్లికన్‌ పార్టీ మంగళగిరి అభ్యర్థి, న్యాయవాది గుర్రం రామారావుతో కలసి అమరావతి ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

Published : 01 May 2024 05:38 IST

మాట్లాడుతున్న మల్లెల వెంకట్రావు

మంగళగిరి, న్యూస్‌టుడే: రాష్ట్రంలో ఫాసిస్ట్‌ పాలన కొనసాగిస్తున్న జగన్‌ను ఓడించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని మాల మహా సభ వ్యవస్థాపక అధ్యక్షుడు మెల్లెల వెంకట్రావు కోరారు. రిపబ్లికన్‌ పార్టీ మంగళగిరి అభ్యర్థి, న్యాయవాది గుర్రం రామారావుతో కలసి అమరావతి ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ఐదేళ్లలో ఎస్సీలు, బీసీలు, మైనార్టీల హక్కులను జగన్‌ కాలరాసి భావితరాల భవిష్యత్తును నాశనం చేశారన్నారు. ఎస్సీ కార్పొరేషన్‌కు కనీసం రూపాయి బడ్జెట్‌ ఇవ్వకుండా పదవులిచ్చి ఉత్సవ విగ్రహాల్లా మార్చారన్నారు. సబ్‌ప్లాన్‌ నిధులు దారి మళ్లించి అన్యాయం చేయడమేకాక..ఉద్యోగుల పదోన్నతుల్లో రిజర్వేషన్లను నిరాకరించి జగన్‌ అన్యాయం చేశారని మండిపడ్డారు. కొత్తగా ఏర్పాటు చేసిన వైద్య కళాశాలల్లో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రిజర్వేషన్లు అమలు చేయకుండా జీవో విడుదల చేసినందుకు 102 మంది డాక్టర్లు కాలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.  82 మంది దళిత యువతులపై అత్యాచారాలు, దాడులు చేసి వైకాపా వర్గీయులే చంపేశారని ఆరోపించారు. ఒక దళితుడిని చంపేసి డోర్‌ డెలివరీ చేసిన అనంతబాబుకు ఎమ్మెల్సీ పదవి, శిరోముండనం చేసిన వ్యక్తికి టికెట్‌ ఇచ్చిన ఘనత జగన్‌దే అని ఎద్దేవా చేశారు. చర్చిల నిర్మాణానికి నిధులిస్తామని మోసం చేయడంతోపాటు ఆయా సంస్థలకు చెందిన ఆస్తులను కాజేసిన వారికి వత్తాసు పలుకుతున్నారని విమర్శించారు. కుటుంబంలో ఒకరికే అమ్మఒడి ఇస్తే మిగిలిన పిల్లల పరిస్థితి ఏంటని నిలదీశారు. చివరికి ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ చట్టం కింద నమోదైన కేసులకు సంబంధించి బాధితులకు అందించే పరిహారం కూడా దారి మళ్లించారని విమర్శించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని