logo

HyderabadNews: మీరు అపార్ట్‌మెంట్‌ వాసులా?.. ఇది మీ కోసమే!

మీరు అపార్ట్‌మెంటు వాసులా.. ఇంకా ఉచిత తాగునీటి పథకం కోసం నమోదు చేసుకోలేదా.. త్వరపడండి. మొత్తం ఫ్లాట్లలో 50-60 శాతం యజమానులు నమోదు చేసుకున్నా..

Updated : 30 Dec 2021 07:42 IST

నమోదుకు రెండు రోజులే గడువు

ఈనాడు, హైదరాబాద్‌: మీరు అపార్ట్‌మెంటు వాసులా.. ఇంకా ఉచిత తాగునీటి పథకం కోసం నమోదు చేసుకోలేదా.. త్వరపడండి. మొత్తం ఫ్లాట్లలో 50-60 శాతం యజమానులు నమోదు చేసుకున్నా.. ఆ అపార్ట్‌మెంట్‌కు ఉచిత తాగునీటి సౌకర్యం పొందే వెసులుబాటు ఉంది. డిసెంబరు 31తో గడువు ముగుస్తున్న దృష్ట్యా వెంటనే నల్లా వినియోగదారుడి సంఖ్య(క్యాన్‌), ఆధార్‌ నంబరుతో అనుసంధానం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. వివిధ కారణాలతో ఇప్పటికీ అనుసంధానం చేసుకోని ఫ్లాట్ల యజమానులకు ఇది సువర్ణావకాశమని పేర్కొంటున్నారు.

అద్దెదారులకూ ఉచితమే

భాగ్యనగరంలో చాలామంది యజమానులు అద్దెతోపాటు నీటి ఛార్జీలు ప్రత్యేకంగా వసూలు చేస్తుంటారు. ఇలాంటి వారిని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. యజమానితో సంబంధం లేకుండా అద్దెదారు ఆధార్‌ కార్డుతో అనుసంధానమైతే ఆ ఇంటికి ఉచిత నీటిని పొందే వీలు ఉంది. ఆధార్‌ అనుసంధానం చేసినా ఆ వ్యక్తికి ఇంటిపై హక్కులు ఉండవని అధికారులు స్పష్టం చేశారు.

పరిస్థితి ఇది లబ్ధిపొందే నల్లాలు 9,84,023

అనుసంధానమైనవి 4,91,000

కావాల్సినవి 4,93,023

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని