logo

ఆశ్రయమిచ్చిన ఇంటికే కన్నం!

‘పని చేసుకుంటాం.. మీ ఇంట్లో ఆశ్రయమివ్వండి’ అంటూ ఓ ఇంటి యజమాని పెంట్‌ హౌస్‌లో ఉంటూ ఆ ఇంట్లోనే చోరీ చేసిన ముగ్గురు నిందితులను దక్షిణ మండలం టాస్క్‌ఫోర్స్‌

Published : 21 Jan 2022 01:27 IST

ఈనాడు, హైదరాబాద్‌: ‘పని చేసుకుంటాం.. మీ ఇంట్లో ఆశ్రయమివ్వండి’ అంటూ ఓ ఇంటి యజమాని పెంట్‌ హౌస్‌లో ఉంటూ ఆ ఇంట్లోనే చోరీ చేసిన ముగ్గురు నిందితులను దక్షిణ మండలం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు గురువారం అరెస్ట్‌ చేశారు. వారి నుంచి రూ.15 లక్షల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు కొత్వాల్‌ సీవీ ఆనంద్‌ వెల్లడించారు. రాజస్థాన్‌ రాష్ట్రం శిఖర్‌ జిల్లాకు చెందిన ఇమ్రాన్‌ అన్సారీ, ముఖేశ్‌ సైనీలు మార్బుల్‌ పనులు చేస్తారు. చాంద్రాయణగుట్టలో కాంట్రాక్టులు తీసుకున్నారు. ఈ క్రమంలో గతేడాది మార్చిలో చాంద్రాయణగుట్టకు చెందిన ఖుర్రమ్‌ ఇంటికి వెళ్లి.. పెంట్‌హౌస్‌లో ఉంటామని ఒప్పించారు. ఆగస్టులో ఖుర్రమ్‌, కుటుంబ సభ్యులతో కలిసి ఇంగ్లండ్‌కు వెళ్లారు. ఆ సమయంలో ఇమ్రాన్‌, ముఖేశ్‌లు ఖుర్రం ఇంట్లో బంగారు ఆభరణాలు చోరీ చేశారు. కొద్దిరోజుల తర్వాత ఇమ్రాన్‌, ముఖేశ్‌లు రాజస్థాన్‌కు వెళ్లిపోయారు. టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ రాఘవేంద్ర దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో ఇమ్రాన్‌ సోదరుడు ఉస్మాన్‌కు భాగస్వామ్యం ఉన్నట్లు గుర్తించి.. గతేడాది సెప్టెంబరులో అతడిని అరెస్ట్‌ చేసి జైలుకు పంపించారు. రెండురోజుల క్రితం వారు నగరానికి వస్తున్నట్లు తెలియడంతో అదుపులోకి తీసుకున్నారు. రాజస్థాన్‌లోని శిఖర్‌ జిల్లాలో ఉంటున్న దీన్‌దీయాళ్‌ ప్రజాపతికి నగలు విక్రయించినట్లు చెప్పడంతో.. అతడిని అరెస్టు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని