logo

చెబితే చెప్పినట్లు.. లేకుంటే లేనట్టు!

ఇంటికి వస్తారు.. జ్వర లక్షణాలున్నాయో లేవో తెలుసుకుంటారు. నివాసితులు చెబితే చెప్పినట్లు.. లేదంటే లేనట్టే..! కరోనా మహమ్మారి కట్టడికి ప్రభుత్వం చేపట్టిన జ్వర సర్వే

Published : 27 Jan 2022 02:49 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఇంటికి వస్తారు.. జ్వర లక్షణాలున్నాయో లేవో తెలుసుకుంటారు. నివాసితులు చెబితే చెప్పినట్లు.. లేదంటే లేనట్టే..! కరోనా మహమ్మారి కట్టడికి ప్రభుత్వం చేపట్టిన జ్వర సర్వే గందరగోళంగా మారింది. లక్షణాలున్న వారిని గుర్తిస్తున్నామని వైద్యారోగ్య శాఖ సిబ్బంది చెబుతున్నా క్షేత్రస్థాయిలో సర్వే తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నగరంతోపాటు శివారులోని రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో జ్వర సర్వేలో భాగంగా ఏఎన్‌ఎం, ఆశా కార్యకర్తలు క్షేత్రస్థాయిలో పర్యటించి వివరాలు సేకరిస్తున్నారు. కనీసం బాధితులను తనిఖీ చేసే పరికరాలు సిబ్బంది వద్ద ఉండటం లేదు. థర్మల్‌ స్కానర్లు సైతం లేకపోవడంతో ఎవరైనా బాధితులకు జ్వరం ఉన్నట్లుగా చెప్పినా.. ఉష్ణోగ్రతలు చూసేందుకు వీలుండటం లేదు. నివాసితులు లక్షణాలున్నట్లు చెబితేనే తెలుస్తోంది. లక్షణాలు ఉన్నట్లుగా చెబితే అప్పటికప్పుడు పేరు, ఫోన్‌ నంబరు నమోదు చేసుకుని కొవిడ్‌ ఐసొలేషన్‌ కిట్‌ అందిస్తున్నారు. కొందరు మాత్రం లక్షణాలు ఉన్నప్పటికీ చెప్పకుండా దాచిపెడుతున్నారని వైద్యరోగ్య సిబ్బంది చెబుతున్నారు.

5 వేల ఇళ్లలో సర్వే.. గ్రేటర్‌లో బుధవారం ఐదు వేల ఇళ్లలో జ్వరం చేసినట్లు జీహెచ్‌ఎంసీ తెలిపింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా చాలా మంది సిబ్బంది సర్వేకు హాజరుకాలేదు. గణాంకాల ప్రకారం.. ఎల్బీనగర్‌, సికింద్రాబాద్‌ జోన్లలో ఎక్కువ మంది వ్యాధి లక్షణాలతో బాధపడుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని