logo

Hyderabad News: జలమండలి నీరు సురక్షితం: ఎండీ దానకిషోర్‌

నగరంలోని పలు ప్రాంతాల్లో కలుషిత నీరు సరఫరా అవుతున్నాయని ప్రజలు నిరసన తెలుపుతున్న వేళ జలమండలి

Updated : 09 Apr 2022 14:12 IST

హైదరాబాద్‌: నగరంలోని పలు ప్రాంతాల్లో కలుషిత నీరు సరఫరా అవుతున్నాయని ప్రజలు నిరసన తెలుపుతున్న వేళ జలమండలి ఎండీ దానకిషోర్‌ స్పందించారు. గ్రేటర్‌ హైదరాబాద్‌తో పాటు ఓఆర్‌ఆర్‌ లోపల ప్రస్తుతం 25వేల నీటి శాంపిల్స్‌ సేకరిస్తున్నామని తెలిపారు. మామూలుగా రోజుకు 10వేల నీటి శాంపిల్స్‌ సేకరిస్తున్నామని.. దాన్ని 25వేలకు పెంచుతున్నట్లు చెప్పారు. ఉదయం 7గంటల నుంచే అధికారులు క్షేత్రస్థాయిలో ఉండి శాంపిల్స్‌ సేకరిస్తున్నారన్నారు. జలమండలి సరఫరా చేస్తున్న నీరు సురక్షితమని దానకిషోర్‌ చెప్పారు. హైదరాబాద్‌లో 70శాతం ప్రజలు జలమండలి సరఫరా చేస్తున్న నీరు తాగుతారని ఆయన వివరించారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని