logo

లక్ష్యం 330 ఛార్జింగ్‌ కేంద్రాలు

రాజధానిలో విద్యుత్తు వాహనాల వినియోగాన్ని ప్రోత్సహిస్తూ జీహెచ్‌ఎంసీ చర్యలు ప్రారంభించింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో 230, హెచ్‌ఎండీఏ పరిధిలో 100 చోట్ల విద్యుత్తు వాహనాలకు ఛార్జింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయాలన్న నిపుణుల సూచన. ఆయా కేంద్రాల్లో

Published : 02 Jul 2022 01:33 IST

విద్యుత్తు వాహనాల ప్రోత్సాహానికి జీహెచ్‌ఎంసీ ప్రణాళిక

ఈనాడు, హైదరాబాద్‌: రాజధానిలో విద్యుత్తు వాహనాల వినియోగాన్ని ప్రోత్సహిస్తూ జీహెచ్‌ఎంసీ చర్యలు ప్రారంభించింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో 230, హెచ్‌ఎండీఏ పరిధిలో 100 చోట్ల విద్యుత్తు వాహనాలకు ఛార్జింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయాలన్న నిపుణుల సూచన. ఆయా కేంద్రాల్లో బ్యాటరీలను వేగంగా, నెమ్మదిగా ఛార్జింగ్‌ చేసే వ్యవస్థలు అందుబాటులో ఉండాలని కూడా సూచించారు. ఆ మేరకు టీఎస్‌ రెడ్కో(తెలంగాణ రాష్ట్ర పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ) జీహెచ్‌ఎంసీతో ఒప్పందం చేసుకొని మొదటి దశ కింద 14 ఛార్జింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అందుకు సంబంధించిన తీర్మానాన్ని బల్దియా ఎలక్ట్రికల్‌ విభాగం రూపొందించింది. స్థాయీ సంఘం తీర్మానాన్ని ఆమోదిస్తే.. టీఎస్‌ రెడ్కో, జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో ప్రైవేటు సంస్థలు ఛార్జింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నాయి. ఛార్జింగ్‌ కేంద్రాల్లో ఖర్చయిన ఒక్కో యూనిట్‌ విద్యుత్తుకు రూ.1 చొప్పున రెడ్కో రుసుము చెల్లించాలనే నిబంధన ఒప్పందంలో ఉందని శుక్రవారం జీహెచ్‌ఎంసీ ఓ ప్రకటనలో తెలిపింది.

ప్రస్తుతం ఏర్పాటు చేయనున్న 14 కేంద్రాలు

ఇందిరాపార్కు వద్ద, కేబీఆర్‌ పార్కు ఒకటో గేటు, మూడో గేటు, ఆరో గేటు, ట్యాంక్‌బండ్‌పై కందకూరి వీరేశలింగం విగ్రహం వద్ద, బషీర్‌బాగ్‌ రోడ్డు, గన్‌ఫౌండ్రీ బాలికల జూనియర్‌ కళాశాల వద్ద, అబిడ్స్‌ మున్సిపల్‌ పార్కింగ్‌ కాంప్లెక్సు, నానక్‌రామ్‌గూడ జీహెచ్‌ఎంసీ స్పోర్ట్‌ కాంప్లెక్సు, వనస్థలిపురం మహావీర్‌ హరిణ వనస్థలి, నాగోలు శిల్పారామం, ఉప్పల్‌ మెట్రోస్టేషన్‌, కాంచన్‌బాగ్‌ ఓవైసీ ఆస్పత్రి, సికింద్రాబాద్‌ తాజ్‌ త్రీ స్టార్‌ హోటల్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని