logo

శాస్త్రీయ సంగీతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లిన మహనీయుడు డాక్టర్‌ మంగళంపల్లి

శాస్త్రీయ సంగీతాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్లిన మహనీయుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ అని మాజీ ఎంపీ డా.సముద్రాల వేణుగోపాలచారి కొనియాడారు. బుధవారం రాత్రి కిన్నెర ఆర్ట్‌ థియేటర్స్‌, కల్చరల్‌, ఎడ్యుకేషనల్‌ ట్రస్టు,

Published : 07 Jul 2022 02:06 IST

నివాళులర్పిస్తున్న వేణుగోపాలచారి,  రమాప్రభ, కళాజనార్దనమూర్తి, రఘురామ్‌

గాంధీనగర్‌, న్యూస్‌టుడే: శాస్త్రీయ సంగీతాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్లిన మహనీయుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ అని మాజీ ఎంపీ డా.సముద్రాల వేణుగోపాలచారి కొనియాడారు. బుధవారం రాత్రి కిన్నెర ఆర్ట్‌ థియేటర్స్‌, కల్చరల్‌, ఎడ్యుకేషనల్‌ ట్రస్టు, త్యాగరాయ గానసభ సంయుక్త ఆధ్వర్యంలో పద్మవిభూషణ్‌ డా.మంగళంపల్లి బాలమురళీకృష్ణ జయంతిని పురస్కరించుకుని కళాసుబ్బారావు కళావేదికలో నిర్వహించిన శాస్త్రీయ సంగీత స్వరనీరాజనం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. డా.వై.రమాప్రభ నిర్వహించిన శాస్త్రీయ సంగీత విభావరి అలరించింది. గానసభ అధ్యక్షుడు కళాజనార్దనమూర్తి, మద్దాళి రఘురామ్‌, రమణమూర్తి, సాయి పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని