logo

షూటింగ్‌లో సత్తా చాటిన సాయికుమార్‌

తెలంగాణ రాష్ట్ర షూటింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో సాయికుమార్‌ సత్తా చాటాడు. గచ్చిబౌలి స్టేడియంలో జరుగుతున్న పోటీల్లో రెండు స్వర్ణాలు సొంతం చేసుకున్నాడు.

Published : 06 Aug 2022 01:52 IST

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర షూటింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో సాయికుమార్‌ సత్తా చాటాడు. గచ్చిబౌలి స్టేడియంలో జరుగుతున్న పోటీల్లో రెండు స్వర్ణాలు సొంతం చేసుకున్నాడు. పురుషుల 50మీ. రైఫిల్‌ ప్రోన్‌ విభాగంలో 588 స్కోరుతో అగ్రస్థానంలో నిలిచాడు. ఖాదిర్‌ (579), రమేశ్‌ (579) వరుసగా రజత, కాంస్య పతకాలు గెలిచారు. 10మీ. రైఫిల్‌లో సాయికుమార్‌ (564), మణిదీప్‌ (547), దారావత్‌ బ్యాచు వరుసగా తొలి మూడు స్థానాలను దక్కించుకున్నారు. 50మీ. రైఫిల్‌ ప్రోన్‌ జూనియర్స్‌లో ముస్తఫా (571), వెంకటేశ్‌ (570), ఓం దీప్‌ (568).. పురుషుల్లో మహ్మద్‌ హసన్‌ (567), హమీద్‌ (565), శశికుమార్‌ (563) వరుసగా స్వర్ణ, రజత, కాంస్య పతకాలు నెగ్గారు. ఓపెన్‌ సైట్‌ సీనియర్‌ పురుషుల 50మీ. రైఫిల్‌లో రవి కుమార్‌ (427) ప్రథమ, జితేంద్ర (325) ద్వితీయ, అక్బర్‌ (235) తృతీయ స్థానాలను సాధించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని