logo

జాతీయ గీతాలాపనకు 675 స్థలాలు ఎంపిక

జిల్లాలో జాతీయ గీతాలాపనకు 675 స్థలాలను ఎంపిక చేశామని జిల్లా పాలనాధికారిణి నిఖిల తెలిపారు. మంగళవారం స్వాతంత్ర భారత వజ్రోత్సవాల వేడుకల నిర్వహణపై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ జిల్లా కలెక్టర్లతో దృశ్య

Published : 10 Aug 2022 01:13 IST

గాంధీ చిత్రాన్ని తిలకిస్తున్న కలెక్టర్‌, డీఈఓ రేణుక, విద్యార్థులు

వికారాబాద్‌ కలెక్టరేట్‌: జిల్లాలో జాతీయ గీతాలాపనకు 675 స్థలాలను ఎంపిక చేశామని జిల్లా పాలనాధికారిణి నిఖిల తెలిపారు. మంగళవారం స్వాతంత్ర భారత వజ్రోత్సవాల వేడుకల నిర్వహణపై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ జిల్లా కలెక్టర్లతో దృశ్య మాధ్యమం ద్వారా మాట్లాడారు. అనంతరం నిఖిల జిల్లాలో నిర్వహిస్తున్న కార్యక్రమాల గురించి వివరించారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి, ఎమ్మెల్యేలతో కలసి మంగళవారం జాతీయ జెండాలను పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. అన్ని గ్రామ పంచాయతీల్లో, పురపాలక సంఘాల్లోని 97 వార్డుల్లో వజ్రోత్సవ కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. వివిధ క్రీడల్లో పోటీలు నిర్వహించి విజేతలకు ఈనెల 18న బహుమతులు అందజేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో ఎస్పీ కోటిరెడ్డి, జడ్పీ సీఈఓ జానకిరెడ్డి, డీర్‌డీఓ కృష్ణన్‌, వివిధ శాఖల జిల్లా అధికారులు కోటాజి, మల్లారెడ్డి, హన్మంత్‌రావు, రేణుకాదేవి, ఆర్డీవో అశోక్‌కుమార్‌, పాల్గొన్నారు.

గాంధీ చిత్ర ప్రదర్శన  
స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా మంగళవారం తాండూరు, వికారాబాద్‌, పరిగి, మర్పల్లిలో ఉన్న 8 సినిమా హాళ్లలో గాంధీ చిత్రాన్ని ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రదర్శించారు. వికారాబాద్‌ సినిమాక్స్‌ థియేటర్‌లో కలెక్టర్‌ నిఖిల, డీఈఓ రేణుకాదేవి చిత్రాన్ని వీక్షించారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాల విద్యార్థులు కలిసి 4,312 మంది సినిమాను చూసినట్లు అధికారులు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని