తగ్గిద్దాం ట్రాఫిక్ చిక్కులు
వాహనదారులు.. పాదచారులు రహదారులపై సాఫీగా ప్రయాణించేందుకు.. స్రాధ్యమైనంత వేగంగా గమ్యస్థానాలు చేరుకునేందుకు ట్రాఫిక్ పోలీసులు ప్రణాళిక రచిస్తున్నారు. ప్రభుత్వం అందుబాటులోకి తెస్తున్న పైవంతెనల వద్ద ట్రాఫిక్ చిక్కులు తగ్గించేందుకు యత్నిస్తున్నారు. ఐటీ కారిడార్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో తరచూ ట్రాఫిక్‌జాంలు అవుతుండడంతో దృష్టి కేంద్రీకరించారు.
పైవంతెనల కింద సాఫీ ప్రయాణానికి పోలీసుల ప్రణాళిక
గచ్చిబౌలి కూడలిలో నిర్మాణంలో ఉన్న శిల్పా లేఅవుట్ పైవంతెన
ఈనాడు, హైదరాబాద్: వాహనదారులు.. పాదచారులు రహదారులపై సాఫీగా ప్రయాణించేందుకు.. స్రాధ్యమైనంత వేగంగా గమ్యస్థానాలు చేరుకునేందుకు ట్రాఫిక్ పోలీసులు ప్రణాళిక రచిస్తున్నారు. ప్రభుత్వం అందుబాటులోకి తెస్తున్న పైవంతెనల వద్ద ట్రాఫిక్ చిక్కులు తగ్గించేందుకు యత్నిస్తున్నారు. ఐటీ కారిడార్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో తరచూ ట్రాఫిక్‌జాంలు అవుతుండడంతో దృష్టి కేంద్రీకరించారు. షేక్‌పేట పైవంతెన.. మాదాపూర్ తీగల వంతెనతోపాటు కొత్తగా అందుబాటులోకి రానున్న ఐకియా, గబ్చిబౌలి పైవంతెనల కింద వాహనాలు సాఫీగా వెళ్లేలా చర్యలు చేపట్టనున్నారు. ప్రస్తుతం ఒక్కోవైపు మూడు వరుసలున్న(లేన్స్) పైవంతెనల నుంచి వేగంగా వస్తున్న వాహనాలు ఒక్కసారిగా ఆగిపోతుండడంతో ట్రాఫిక్ పోలీసులు శ్రమపడి నియంత్రిస్తున్నారు.
తీగల వంతెన దిగేశాక...
గచ్చిబౌలి, మాదాపూర్ నుంచి తీగల వంతెన మీదుగా జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, బంజారాహిల్స్‌కు వేల సంఖ్యలో వాహనాలు వస్తున్నాయి. కేబుల్ వంతెన ప్రారంభమైన దగ్గర నుంచి ఫ్లైఓవర్ దిగేంత వరకు సాఫీగా వచ్చినా.. రోడ్ నం.45 వద్ద రోడ్డు ఇరుకుగా ఉండడంతో వందల సంఖ్యలో వాహనాలు ఆగిపోతున్నాయి. సాయంత్రం వేళల్లో ఒక్కోసారి రెండు, మూడుసార్లు రెడ్‌లైట్ పడుతోంది. జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ నుంచి అపోలో ఆసుపత్రివైపు, బంజారాహిల్స్ రోడ్ నం. 12 నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వైపు వెళ్లే వాహనాలకు ట్రాఫిక్ కూడలి వద్ద ఎక్కువ సమయం ఇస్తుండడంతో జూబ్లీహిల్స్ రోడ్ నం.45 మీదుగా వస్తున్న వాహనదారులు ఒక్కసారిగా ఆగిపోతున్నారు.
ఐకియా నుంచి ఇనార్బిట్ మధ్య ఫ్లైఓవర్
షేక్‌పేట దాటితే..
గచ్చిబౌలి నుంచి మెహిదీపట్నం వరకు ట్రాఫిక్ చిక్కులు తగ్గించేందుకు షేక్‌పేట మల్లం చెరువు నుంచి టోలీచౌకీ గెలాక్సీ థియేటర్ సమీపం వరకున్న షేక్‌పేట ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చాక కూడా ట్రాఫిక్ చిక్కులు తగ్గలేదు. షేక్‌పేట, విష్పర్‌వ్యాలీ, ఓయూ కాలనీ, ఫిలింనగర్ క్రాస్రోడ్ల వద్ద వాహనాలు ఆగకుండా ఉండేందుకు ఫ్లైఓవర్‌ను అందుబాటులోకి తెచ్చారు.
* మెహిదీపట్నం నుంచి గచ్చిబౌలి వెళ్లే వాహనదారులకు ఇది సౌకర్యంగా ఉంటున్నా.. గచ్చిబౌలి, మాదాపూర్ నుంచి అత్తాపూర్, మెహిదీపట్నంవైపు వెళ్లే వాహనదారులు ఫ్లైఓవర్ దిగిన వెంటనే కింది వైపు నుంచి వస్తున్న బస్సులు, వాహనాలు, పైవంతెన మీదుగా కిందికి దిగిన వాహనాలకు అడ్డంకిగా మారుతున్నాయి. షేక్‌పేట, మెహిదీపట్నం మార్గంలో వాహనదారులు ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేతలు రోడ్డెక్కె.. ప్రచారం వేడెక్కె
[ 26-04-2024]
రాజధానిలో లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారం వేడెక్కింది. మొన్నటివరకు అభ్యర్థులు ఖరారు కాకపోవడం.. ఎండలు మండిపోతుండటంతో జనంలోకి వెళ్లడానికి నేతలు వెనకాముందాడారు. ఎన్నికలకు సమయం సమీపిస్తుండటంతో పార్టీల్లో కదలిక వచ్చింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్‌సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
కేరింతలతో హోరెత్తె..
[ 26-04-2024]
సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌కు క్రికెట్ అభిమానులు భారీగా తరలివచ్చారు. పరిసర ప్రాంతాలు కిటకిటలాడాయి. -
నగరాన.. సీఎం సుడిగాలి పర్యటన
[ 26-04-2024]
సీఎం రేవంత్‌రెడ్డి గురువారం నగరంలో సుడిగాలి పర్యటన చేశారు. ఇటీవల మధుయాస్కి తల్లి మృతి చెందడంతో ఉదయం హయత్‌నగర్‌లోని ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. -
రారండోయ్.. ఓటేయడానికి ఆంధ్రాకు
[ 26-04-2024]
ఎన్నికలంటే ఎప్పుడైనా సందడే.. ఓటర్లను కూడగట్టడం ఎంతో వ్యయప్రయాసలతో కూడుకున్న పని. ప్రస్తుత ఎన్నికలు ఆంధ్రప్రదేశ్‌కు ఎంతో ప్రతిష్ఠాత్మకమని భావిస్తున్నారు. -
45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ
[ 26-04-2024]
అర్ధరాత్రి తర్వాత మహిళపై సామూహిక అత్యాచారం.. ఆపై హత్య.. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు సీసీ కెమెరాల్లో ఇద్దరూ పరారయ్యే అస్పష్ట చిత్రాలు తప్ప ఒక్క ఆధారం లభించలేదు. -
స్మార్ట్‌గా ఓటర్లకు చేరువ
[ 26-04-2024]
ఎన్నికలంటే పార్టీలు, అభ్యర్థుల పాటలతో బస్తీలు మార్మోగేవి. కార్యకర్తలు, అభిమానులు పార్టీ జెండాలు, కండువాలతో పెద్దఎత్తున ఇంటింటి ప్రచారం నిర్వహించేవారు. -
దోమా దోమ.. ఇం‘ధనం ఏదమ్మా’?
[ 26-04-2024]
జీహెచ్ఎంసీ ఎంటమాలజీ విభాగం దోపిడీకి చిరునామాగా మారింది. ఫాగింగ్ పేరుతో కొందరు జోనల్ స్థాయి అధికారులు డీజిల్‌ను అమ్మేసుకుంటున్నారు. -
టీఎస్బీపాస్తోనే అనుమతులు
[ 26-04-2024]
భవన నిర్మాణాలు, లేఅవుట్ల అనుమతులను హెచ్ఎండీఏ పరిధిలో ఇక నుంచి ఏకగవాక్ష పద్ధతిలో జారీ చేయనున్నారు. గతంలో అందుబాటులోకి తెచ్చిన తెలంగాణ స్టేట్ లేఅవుట్ అండ్ బిల్డింగ్ పర్మిషన్ ఆమోదం, స్వీయ ధ్రువీకరణ వ్యవస్థ(టీఎస్‌బీపాస్) ద్వారానే అనుమతులు మంజూరు చేస్తారు. -
ముగిసిన మొదటి పర్వం
[ 26-04-2024]
రాజధానిలోని నాలుగు లోక్‌సభ నియోజకవర్గాలకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారంతో ముగిసింది. చివరి రోజు కావడంతో నామినేషన్లు భారీగా దాఖలయ్యాయి. -
రూ.వంద కోట్లు దాటినా.. ఇచ్చింది సున్నా
[ 26-04-2024]
శివార్లలో మురుగు నిర్వహణకు సంబంధించి నిధుల విడుదలలో బల్దియా జాప్యంతో జలమండలి మల్లగుల్లాలు పడుతోంది. 13 నెలలుగా ఒక్క పైసా కూడా బల్దియా నుంచి జలమండలి ఖాతాకు జమ కావడంలేదని అధికారులు వాపోతున్నారు. -
జేఈఈ మెయిన్స్‌లో సత్తా
[ 26-04-2024]
ఇంజినీర్ కావడానికి ఐఐటీల్లోనే చదవాలన్న సంకల్పంతో రెండేళ్లు వారు అహర్నిశలు కష్టపడ్డారు. తల్లిదండ్రులు, అధ్యాపకుల ప్రోత్సాహంతో జేఈఈ మెయిన్స్ పరీక్షల్లో సత్తా చాటారు. వంద శాతం పర్సంటైల్ సాధించి ప్రతిభ కనబరిచారు. -
శేషగిరికి కన్నీటి వీడ్కోలు
[ 26-04-2024]
విధుల్లో ఉన్న సమయంలో ఏకే-47 తుపాకీ ప్రమాదవశాత్తు పేలడంతో మృతిచెందిన సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ శేషగిరి(47)కు నగరవాసులు కన్నీటి వీడ్కోలు పలికారు. -
తలసరి ఆదాయమేకాదు.. కరెంట్ వినయోగంలోనూ టాప్
[ 26-04-2024]
ఐటీ సంస్థలు.. ఏరో సెజ్‌లు.. డాటా కేంద్రాలు, అంతర్జాతీయ విమానాశ్రయం.. పరిశ్రమలు.. ఈ-మొబిలిటీ వ్యాలీ.. ఆకాశహార్మ్యాలు... కన్వెన్షన్ సెంటర్లు.. వినోద కేంద్రాలు.. విద్యాసంస్థలు.. వ్యవసాయ ఉత్పత్తులకు నిలయంగా ఉన్న రంగారెడ్డి జోన్ పరిధిలో అత్యధిక కరెంట్ డిమాండ్ ఉంటోంది. -
ఐపీఎల్ టికెట్ల గోల్‌మాల్‌పై చర్యలకు డిమాండ్
[ 26-04-2024]
ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ టికెట్ల గోల్మాల్, బ్లాక్ దందాపై సమగ్ర విచారణ చేసి చర్యలు తీసుకోవాలని స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనారెడ్డి డిమాండ్ చేశారు. -
మంగళ్ ‘హాట్ ఠాణా’
[ 26-04-2024]
శాంతిభద్రతలపరంగా మంగళ్‌హాట్ ఠాణా అతి సున్నితమైంది. పోలీస్ స్టేషన్లో కొందరు అధికారులు, సిబ్బంది అవినీతి, అక్రమాలతో అప్రతిష్ఠ మూటగట్టుకుంటోంది. -
నినాదాల హోరు.. కాంగ్రెస్ శ్రేణుల జోరు
[ 26-04-2024]
రాజేంద్రనగర్ నియోజకవర్గం అత్తాపూర్‌లో గురువారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్వహించిన రోడ్డుషో సందడిగా సాగింది. ఉప్పర్‌పల్లిలో కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. -
అధ్యాపకుల కొరత.. అసౌకర్యాల వెత
[ 26-04-2024]
జిల్లాలో ఈసారి ఇంటర్ ద్వితీయ ఫలితాలు ఒక మెట్టు కిందకే ఉండటం అటు అధ్యాపకులను, ఇటు తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తోంది. అదే సమయంలో ప్రథమ సంవత్సరంలో మాత్రం మెరుగైన ఫలితం రావడం అందరికీ సంతోషదాయకంగా ఉంది. -
దేవాదాయ భూముల రక్షణకు సమష్టి కృషి
[ 26-04-2024]
దేవాదాయ శాఖకు సంబంధించిన భూములు అన్యాక్రాంతం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా అదనపు పాలనాధికారి లింగ్యానాయక్ అన్నారు. -
న్యాయమూర్తులకు ఘనంగా వీడ్కోలు
[ 26-04-2024]
ఉద్యోగ జీవితంలో బదిలీలు అనివార్య ప్రక్రియ అని రంగారెడ్డి జిల్లా కోర్టుల ప్రధాన న్యాయమూర్తి ఎస్.శశిధర్‌రెడ్డి అన్నారు. -
ముగిసిన చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలు
[ 26-04-2024]
వారం రోజులుగా అట్టహాసంగా కొనసాగిన చిలుకూరు బాలాజీ దేవాలయం బ్రహ్మోత్సవాలు గురువారం చక్రస్నానం, ధ్వజావరోహణంతో ముగిశాయి. -
‘అభివృద్ధి మరిచి తిట్లతో పాలిస్తున్నారు’
[ 26-04-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి, ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసి తిట్ల పురాణంతో పాలన సాగిస్తుందని మాజీ మంత్రి మల్లారెడ్డి ఆరోపించారు. -
రేవంత్‌రెడ్డి సభలో స్పృహ తప్పిన కార్యకర్త
[ 26-04-2024]
లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గురువారం అత్తాపూర్‌లో నిర్వహించిన రోడ్డుషోలో ప్రసంగిస్తుండగా ఆయన ముందున్న కార్యకర్తల్లో ఒకరు స్పృహ తప్పి పడిపోయారు. -
రెండో ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి: రోనాల్డ్ రాస్
[ 26-04-2024]
పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా పోలింగ్ సిబ్బంది, అధికారుల రెండో ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తయిందని జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్‌రాస్ పేర్కొన్నారు.