logo

విద్యుత్తు రంగంలో తెలంగాణదే మొదటి స్థానం: సీఎండీ ప్రభాకర్‌రావు

విద్యుత్తు పంపిణీలో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉందని ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు పేర్కొన్నారు. గురువారం ఉదయం మింట్‌కాంపౌండ్‌లో రాష్ట్ర విద్యుత్తు అకౌంట్స్‌

Published : 19 Aug 2022 02:46 IST

ఖైరతాబాద్‌: విద్యుత్తు పంపిణీలో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉందని ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు పేర్కొన్నారు. గురువారం ఉదయం మింట్‌కాంపౌండ్‌లో రాష్ట్ర విద్యుత్తు అకౌంట్స్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ (టీఎస్‌ఈఏఓఏ) నూతన భవన నిర్మాణానికి ఎస్పీడీసీఎల్‌ సీఎండీ జి.రఘుమారెడ్డి, ట్రాన్స్‌కో జేఎండీ శ్రీనివాసరావు తదితరులతో కలిసి సీఎండీ భూమి పూజ చేశారు. ఆయన మాట్లాడుతూ.. మీటరు అమ్మకాలు పెంచడంతో పాటు సాంకేతికతను మెరుగుపర్చుకోవడం ద్వారా ఆర్థికాభివృద్ధి సాధించే అవకాశం ఉందని, అప్పుడే సంస్థలు అభివృద్ధి పథంలో నడుస్తాయన్నారు. ఉత్పత్తి, పంపిణీలో ముందున్నామని,  ఆర్థికంగానూ ముందుకు వెళ్లాలన్నారు. టీఎస్‌ ఎస్పీడీసీఎల్‌ సీఎండీ జి.రఘుమారెడ్డి మాట్లాడుతూ..  వచ్చే ఏడాది ఈ రోజు నాటికి నూతన భవనం ప్రారంభోత్సవం జరగాలని ఆకాంక్షించారు. టీఎస్‌ఈఏఓఏ ప్రధాన కార్యదర్శి పి.అంజయ్య మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ దిశా నిర్దేశం, మంత్రి జగదీశ్‌రెడ్డి, సీఎండీ ప్రభాకర్‌రావు నిరంతర కృషి ఫలితంగా సంస్థలు మంచి ఫలితాలుసాధిస్తున్నాయన్నారు. సంస్థ సీఎఫ్‌ఓ అనూరాధ, సీజీఎంలు, టీఎస్‌ఈఏఓఏ అధ్యక్షుడు అశోక్‌, షరీఫ్‌, శ్యామలరావు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని