logo

చిత్ర వార్తలు

పువ్వులనే దైవంగా భావించి కొలిచె బతుకమ్మ పండగకు విద్యాసంస్థలు వేదికలయ్యాయి. శుక్రవారం అబిడ్స్‌లోని స్లేట్‌ పాఠశాల, కోఠి మహిళా విశ్వవిద్యాలయాల్లో వేడుకలు జరిగాయి.

Published : 24 Sep 2022 03:33 IST

పూలను పేర్చి.. గౌరమ్మను కొలిచి

పువ్వులనే దైవంగా భావించి కొలిచె బతుకమ్మ పండగకు విద్యాసంస్థలు వేదికలయ్యాయి. శుక్రవారం అబిడ్స్‌లోని స్లేట్‌ పాఠశాల, కోఠి మహిళా విశ్వవిద్యాలయాల్లో వేడుకలు జరిగాయి. విద్యార్థినులు బతుకమ్మలను పేర్చి చుట్టూ చేరి గౌరమ్మను పూజిస్తూ ఆడిపాడారు.


న్యాయ శిఖరానికి ఆత్మీయ స్వాగతం

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఇటీవలే పదవీ విరమణ చేసి తొలిసారి నగరానికి వచ్చిన జస్టిస్‌ ఎన్‌వీ రమణకు శ్రేయోభిలాషులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. శుక్రవారం దిల్లీ నుంచి వచ్చిన ఆయనకు శంషాబాద్‌ విమానాశ్రయంలో బంధుమిత్రులు, ఆత్మీయులు స్వాగత బ్యానర్లు ప్రదర్శిస్తూ పుష్పగుచ్ఛాలు అందించి సన్మానం చేశారు.


నిమ్స్‌లో తప్పని నిరీక్షణ

ప్రభుత్వ ఆసుపత్రులకు ఇటీవల రోగులు పోటెత్తుతున్నారు. ఆ మేరకు అక్కడ మౌలిక వసతులు లేకపోవడం, సిబ్బందిని నియమించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కిటకిటలాడుతున్న ఓపీలో చీటీ చేజిక్కించుకొని వైద్యుల వద్దకు వెళ్లేసరికే సమయం మించిపోతోంది. మరుసటి రోజు రావాల్సి వస్తోంది. శుక్రవారం నిమ్స్‌ ఆసుపత్రి ఓపీలో నెలకొన్న రద్దీ ఇది. స్ట్రెచ్చర్లూ రోగుల సహాయకులే నెట్టుకెళ్లాల్సి వస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని