logo

విద్యుత్తు అంతరాయం.. రోగుల అవస్థలు

వికారాబాద్‌లో విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడినప్పుడు రక్తశుద్ధి కేంద్రంలో సేవలు నిలిచిపోయి బాధితులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జనరేటర్‌ కూడా పనిచేయకపోవడంతో అవస్థలు తప్పడంలేదని రోగులు ఫిర్యాదు చేస్తున్నారు.

Published : 04 Oct 2022 03:03 IST

చీకట్లో రక్తశుద్ధి కేంద్రం

వికారాబాద్‌ మున్సిపాలిటీ, న్యూస్‌టుడే: వికారాబాద్‌లో విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడినప్పుడు రక్తశుద్ధి కేంద్రంలో సేవలు నిలిచిపోయి బాధితులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జనరేటర్‌ కూడా పనిచేయకపోవడంతో అవస్థలు తప్పడంలేదని రోగులు ఫిర్యాదు చేస్తున్నారు. కరెంట్‌ వచ్చేంత వరకు చీకట్లో ఉండాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మూత్రపిండాల వ్యాధి ఉన్న వారు తప్పని సరిగా రక్తశుద్ధి చేయించుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం ఒక్కరికి కనీసం నాలుగు గంటల సమయం పడుతుంది. ఆ సమయంలో విద్యుత్తు సరఫరా నిలిచిపోతే వారు పడే బాధ వర్ణనాతీతం. మెరుగైన సేవలు అందిస్తున్నామని అధికారులు చెబుతున్నా, ఈ సమస్యను పరిష్కరించడంలేదు. కరెంట్‌ సరఫరాలో తరచుగా అంతరాయం ఏర్పడుతోందని, జనరేటర్‌ పనిచేయనపుడు రోగులు చరవాణి వెలుతురులో ఉంటున్నారని రక్తశుద్ది కేంద్రం ఇన్‌ఛార్జి మహ్మద్‌ రిజ్వాన్‌ అన్నారు. ఈ పరిస్థితిని ఉన్నతాధికారులకు విన్నవించామన్నారు.

కరెంట్‌ లేక రెండు గంటల నిరీక్షణ : బల్వంత్‌రెడ్డి, రోగి భర్త, కోత్లాపూర్‌

కేంద్రంలో తరచుగా విద్యుత్తు సరఫరా నిలిచిపోతోంది. నా భార్య సుశీలను వారానికి రెండు సార్లు ఇక్కడికి తీసుకువస్తాను. సోమవారం ఉదయం 10 గంటలకు వచ్చాం. కరెంట్‌ లేక 12గంటల వరకు బయటే ఉన్నాం.దీంతో రోగులు ఇబ్బంది పడుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని