logo

మీరాలం చెరువును.. ఇలాగే చేయండి

‘అర్వింద్‌ సార్‌.. దుర్గం చెరువును అభివృద్ధి చేసినట్టుగానే పాతబస్తీలోని మీరా లం చెరువు రూపు రేఖలూ మార్చండి. అందమైన చెరువు మీరాలం.

Published : 25 Nov 2022 02:46 IST

అర్వింద్‌కుమార్‌కు ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ ట్వీట్‌


దుర్గం చెరువు వద్ద పడవలు

ఈనాడు, హైదరాబాద్‌:  ‘అర్వింద్‌ సార్‌.. దుర్గం చెరువును అభివృద్ధి చేసినట్టుగానే పాతబస్తీలోని మీరా లం చెరువు రూపు రేఖలూ మార్చండి. అందమైన చెరువు మీరాలం. దీన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది’ అని ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్‌ను గురువారం ట్విటర్‌ ద్వారా అభ్యర్థించారు. దుర్గం చెరువు వద్ద పడవల్లో షికారుకు హెచ్‌ఎండీఏ ఏర్పాట్లు చేస్తోంది. విద్యార్థులు, మహిళలు, పిల్లలకు ఇది ఎంతో ఉత్సాహాన్ని కలిగించనుందని దుర్గం చెరువు ఫొటోలను అర్వింద్‌కుమార్‌ గురువారం ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. వాటిని చూసిన ఎంపీ ఈ మేరకు స్పందించారు. త్వరలో చర్యలు తీసుకుంటామని అర్వింద్‌ రీట్వీట్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని