logo

ఐఐసీటీకి వచ్చిన సౌర బస్సు

వాతావరణ మార్పులతో తలెత్తుతున్న ముప్పు నివారణకు తీసుకోవాల్సిన సరైన చర్యలపై అవగాహన కల్పించేందుకు ఎనర్జీ స్వరాజ్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు, ముంబయి ఐఐటీ ఆచార్యులు సొలంకీ బస్సు యాత్ర చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ప్రజల్లో అవగాహన కల్పించే వరకు ఇంటికి వెళ్లనని ఆయన 2020లో ప్రతిజ్ఞ చేశారు. 

Published : 20 Jan 2023 03:45 IST

సౌర బస్సు లోపల ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు, ఐఐటీ ఆచార్యులు

ఈనాడు, హైదరాబాద్‌: వాతావరణ మార్పులతో తలెత్తుతున్న ముప్పు నివారణకు తీసుకోవాల్సిన సరైన చర్యలపై అవగాహన కల్పించేందుకు ఎనర్జీ స్వరాజ్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు, ముంబయి ఐఐటీ ఆచార్యులు సొలంకీ బస్సు యాత్ర చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ప్రజల్లో అవగాహన కల్పించే వరకు ఇంటికి వెళ్లనని ఆయన 2020లో ప్రతిజ్ఞ చేశారు.  బస్సులోనే వంటగది, గ్రంథాలయం, బెడ్‌ వంటి సదుపాయాలున్నాయి. సౌర బస్సుతో సొలంకీ బృందం గురువారం తార్నాకలోని ఐఐసీటీకి వచ్చింది. ఐఐసీటీ- జహీర్‌ మెమోరియల్‌ హైస్కూల్‌ విద్యార్థులకు పిల్లలకు బస్సు గురించి, యాత్ర గురించి వివరించారు. అవసరం లేనప్పుడు  విద్యుత్తు ఉపకరణాలను ఆపేసే అలవాటు పిల్లలు, సిబ్బంది చేసుకోవాలని ఐఐసీటీ డైరెక్టర్‌ డాక్టర్‌ డి.శ్రీనివాస్‌రెడ్డి సూచించారు.

Read latest Hyderabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని