logo

అంతర్జాతీయ వ్యభిచార ముఠాలో సినీ రచయిత!

సంచలనం రేకెత్తించిన అంతర్జాతీయ వ్యభిచార రాకెట్‌ కేసులో సైబరాబాద్‌ యాంటీ హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ యూనిట్‌ మరో 8 మంది కీలక నిందితులను అరెస్ట్‌ చేసింది.  

Updated : 28 Jan 2023 04:24 IST

ఈనాడు, హైదరాబాద్‌: సంచలనం రేకెత్తించిన అంతర్జాతీయ వ్యభిచార రాకెట్‌ కేసులో సైబరాబాద్‌ యాంటీ హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ యూనిట్‌ మరో 8 మంది కీలక నిందితులను అరెస్ట్‌ చేసింది.  అరెస్టయిన 8 మంది నిందితులపై 4 కేసులు నమోదయ్యాయి. సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్‌ రవీంద్ర పర్యవేక్షణలో సైబరాబాద్‌ పోలీసులు, యాంటీ హ్యూమన్‌ ట్రాఫిక్‌ కింగ్‌ యూనిట్‌ కొంతకాలంగా వీరి కార్యకలాపాలపై నిఘా ఉంచింది.  ముంబయి నివాసి మోహిత్‌ సత్పాల్‌ అలియాస్‌ గార్గ్‌, అలియాస్‌ రోహన్‌, అలియాస్‌ రాకీ, అలియాస్‌ మోహిత్‌ కబీర్‌(28) ఈ వ్యవహారంలో కీలక సూత్రధారి. బాలీవుడ్‌లో కథా రచయిత. వ్యభిచార గృహాలకు యువతులను తరలించేవాడు. వచ్చిన సొమ్ములో 30 శాతం బాధితులకు, 70 శాతం తాను తీసుకునేవాడు. మూడేళ్ల వ్యవధిలో 300-400 మంది అమ్మాయిలను వ్యభిచార రొంపిలోకి దింపాడు. ఇదే ముఠాలో ముంబయికి చెందిన జై అలియాస్‌ జై సాహో(40), హైదరాబాద్‌ ఘాన్సీబజార్‌లో ఉంటున్న మహారాష్ట్రకు చెందిన జన్వర్‌ విశాల్‌ అలియాస్‌ ప్రీత్‌(33), హైదరాబాద్‌ ఉప్పరపల్లిలో నివసిస్తున్న సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌కు చెందిన మహ్మద్‌ సొహైల్‌ అలియాస్‌ సాహిల్‌(38), హైదరాబాద్‌లోని టోలీచౌకి వాసి మహ్మద్‌ ఖలీల్‌ అలియాస్‌ సల్మాన్‌(40), హైదరాబాద్‌ కొండాపూర్‌లో ఉంటున్న, ప్రకాశం జిల్లాకు చెందిన వ్యభిచార గృహ నిర్వాహకుడు ఎం.శ్రీకాంత్‌ అలియాస్‌ శ్రీకాంత్‌ బాబు(29), యువతులను తరలిస్తున్న బంగ్లాదేశ్‌కు చెందిన మహిళ(26), కొండాపూర్‌లో వ్యభిచార గృహం నిర్వహిస్తున్న పశ్చిమబెంగాల్‌కు చెందిన మెహిదీదాస్‌ అలియాస్‌ మెహిదీఖాన్‌(38) ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని