logo

25 శాతం పూర్తయిన దక్కన్‌ మాల్‌ కూల్చివేత పనులు

సికింద్రాబాద్‌ మినిస్టర్‌ రోడ్డులో అగ్ని ప్రమాదానికి గురైన దక్కన్‌ మాల్‌ కూల్చివేత పనులు వేగవంతంగా సాగుతున్నాయి.

Published : 28 Jan 2023 13:31 IST

రెజిమెంటల్‌ బజార్‌: సికింద్రాబాద్‌ మినిస్టర్‌ రోడ్డులో అగ్ని ప్రమాదానికి గురైన దక్కన్‌ మాల్‌ కూల్చివేత పనులు వేగవంతంగా సాగుతున్నాయి. ఈ నెల 19న దక్కన్‌ మాల్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. భారీ అగ్ని ప్రమాదం సంభవిచండంతో ఈ భవనం నాణ్యత లోపించడం కారణంగా దీన్ని కూల్చివేయాలని అధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగా మాల్‌కు మాలిక్‌ ట్రేడింగ్‌ అండ్‌ డిమాలిషన్ సంస్థకు కాంట్రాక్టు దక్కడంతో గురువారం రాత్రి 11 గంటల నుంచి కూల్చివేతను ప్రారంభించింది. శనివారం ఉదయం వరకు 25 శాతం మేర కూల్చివేత పనులు జరిగాయని సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ పనులను మరింత వేగవంతంగా పూర్తి చేస్తామని, చుట్టు పక్కల వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనసాగిస్తామని అధికారులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని