logo

పచ్చజెండా ఊపి ఆరేళ్లు

జనాభా పెరుగుతోంది. నగరం అభివృద్ధి చెందుతోంది. జిల్లాలు, రాష్ట్రాలు దాటి వచ్చి వెళ్లే వారి అవసరాలకు తగ్గట్లుగా దక్షిణ మధ్య రైల్వే మాత్రం సేవలు అందించలేకపోతోంది.

Published : 29 Jan 2023 02:37 IST

నగరవాసులకు అందుబాటులోకి రాని కొత్త రైళ్లు
దశాబ్దాలుగా ప్రతిపాదనల దశలోనే లైన్ల విస్తరణ
ఈనాడు, హైదరాబాద్‌

2016లో ప్రారంభమైన రైలు

జనాభా పెరుగుతోంది. నగరం అభివృద్ధి చెందుతోంది. జిల్లాలు, రాష్ట్రాలు దాటి వచ్చి వెళ్లే వారి అవసరాలకు తగ్గట్లుగా దక్షిణ మధ్య రైల్వే మాత్రం సేవలు అందించలేకపోతోంది. రద్దీ మార్గాలు గుర్తించి అవసరమైన మేర కొత్త రైళ్లను ప్రవేశపెట్టడంలో వెనుకబడింది. ఎంతగా అంటే గత దశాబ్దకాలంలో నగరం నుంచి ఒకే ఒక కొత్త రైలు ప్రారంభమైందంటే నమ్మగలరా.

ఇంటర్‌సిటీ మాత్రమే..

దక్షిణ మధ్య రైల్వేలో  గత పదేళ్లలో 2016లో లింగంపల్లి-విజయవాడ మధ్య నడిచే ఉద్యోగుల ప్రత్యేక ·ఇంటర్‌ సిటీ ఎక్స్‌ప్రెస్‌ మినహా కొత్తగా ఒక్క రైలు రాలేదు. అరకొర రైళ్లు కొన్నింటిని రూటు పొడిగించారు. రెండు ఐటీ హబ్‌లుగా పేరుగాంచిన బెంగళూరు-హైదరాబాద్‌ మధ్య పూర్తి స్థాయిలో రెండో రైల్వే లైను అందుబాటులోకి రాలేదు. ఇటీవల మహబూబ్‌నగర్‌ వరకూ రెండో లైను పూర్తి చేశారు. విజయవాడ, విశాఖపట్నం వైపు నాలుగు లైన్లు అవసరమైనంత డిమాండ్‌ ఉన్నా రెండు లైన్లతోనే సరిపెట్టుకోవాల్సి వస్తోంది.

డిమాండ్‌ ఉన్నప్పటికీ..

* నగరం నుంచి వారణాసికి వెళ్లాలంటే 4 నెలలు ఆగాలి. సికింద్రాబాద్‌- దానాపూర్‌ రైలుకు టిక్కెట్లు దొరకడం గగనం. సికింద్రాబాద్‌ నుంచి ఉత్తరాంధ్ర వెళ్లాలన్నా అదే పరిస్థితి. * హైదరాబాద్‌-బెంగళూరును కలుపుతూ మరో రైలు అందుబాటులోకి రావాల్సి ఉంది. హైదరాబాద్‌-నాగ్‌పూర్‌కు హైస్పీడ్‌ రైల్వే లైను నిర్మించాలనే ప్రతిపాదనలు అమలుకు నోచుకోవడంలేదు. * ప్రతి రాష్ట్ర రాజధాని నుంచి సంపర్క్‌క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లను దేశ రాజధానికి అనుసంధానం చేసి నడుపుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ఉన్నప్పుడు తిరుపతి నుంచి సికింద్రాబాద్‌ మీదుగా ఈ రైలు వేశారు. నేటికీ ఇదే రైలుతో సరిపెట్టేశారు. * సికింద్రాబాద్‌ నుంచి కరీంనగర్‌కు వయా కాజీపేట్‌, పెద్దపల్లి మీదుగా రైలు డిమాండ్‌ ఉంది. * సికింద్రాబాద్‌ నుంచి వయా నిజామాబాద్‌ మీదుగా బోధన్‌కు డెమూ రైళ్లను నడపాలి.

నిత్యం రాకపోకలు సాగించే రైళ్లు: 240
ప్రయాణికులు: సుమారు 2 లక్షలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని