logo

ప్రైవేటు వాహనాలకు బస్టాపులు

సొమ్మొకరిది సోకొకరిదిలా ఆర్టీసీ బస్టాపుల వ్యవహారం ఉంది. నగరంలో 2450 బస్సు స్టాపులున్నాయి. ఇందులో 1250 బస్సు స్టాపులకు బస్సు బేలు లేవు. అలాగే షెల్టర్లు లేవు.

Published : 03 Feb 2023 01:44 IST

ఈనాడు - హైదరాబాద్‌: సొమ్మొకరిది సోకొకరిదిలా ఆర్టీసీ బస్టాపుల వ్యవహారం ఉంది. నగరంలో 2450 బస్సు స్టాపులున్నాయి. ఇందులో 1250 బస్సు స్టాపులకు బస్సు బేలు లేవు. అలాగే షెల్టర్లు లేవు. ఈ లెక్కలన్నీ ఒకెత్తయితే.. ఏమాత్రం బస్సు బే ఉన్నా.. అవి పార్కింగ్‌ స్లాట్‌లుగా మారిపోతున్నాయి. నగరంలో బస్సు బేలున్న ప్రతి స్టాపూ వాహనాల పార్కింగ్‌ స్థలంగా మారిపోతోంది. గతంలో ముఖ్యమైన బస్సు స్టాపుల్లో ఆర్టీసీ సూపర్‌వైజర్లు ఉండేవారు. బస్సు స్టాపులో ఆటోలు ఆగకుండా.. ఇతర వాహనదారులు పార్కింగ్‌ చేయకుండా.. బస్సులన్నీ సరిగ్గా బస్సు స్టాపులో ఆగినట్టు చూసి ప్రయాణికులు సులభంగా బస్సులు ఎక్కేలా చేసేవారు. వీరికి ట్రాఫిక్‌ పోలీసులు కూడా సహకరించేవారు. ఇప్పుడీ సమన్వయం కొరవడింది. ప్రజారవాణాకు సహకరించాల్సిన సంస్థలు ఎవరికి వారుగా పని చేసుకుంటూ.. ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్నాయి.


పార్కింగ్‌ స్థలాలుగా మారిన వైనం..

జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు నుంచి బంజారాహిల్స్‌కు వస్తున్నప్పుడు ఉన్న బస్సు స్టాపులో అక్కడ కార్లన్నీ పార్కు చేసి ఉంటున్నాయి. అలాగే హైటెక్‌సిటీ నుంచి మాదాపూర్‌ వెళ్తున్న దారిలో సైబర్‌టవర్స్‌ బస్సు స్టాపులో కార్లు, క్యాబ్‌లు, ఆటోలు ఆగి ఉంటున్నాయి. జేఎన్‌టీయూ బస్సు స్టాపును మొత్తం ఆటోలు ఆక్రమించేశాయి. ఇలా నగరంలో 1250 చోట్ల బస్సు బేలుంటే.. వాటిని ప్రైవేటు వాహనదారులు పార్కింగ్‌లా వినియోగించుకుంటున్నారు. బస్టాపులో ఆటోలు, క్యాబ్‌లు పార్కింగ్‌ చేసి ఉంచడంతో నడిరోడ్డున బస్సులు ఆపాల్సిన పరిస్థితి వస్తోందని డ్రైవర్లు వాపోతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని