logo

మహిళలు లేనిచోటుకు అతడిని బదిలీ చేయండి

మహిళా ఉద్యోగినిపై వేధింపులకు పాల్పడిన ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ ఆర్‌.మోహన్‌సింగ్‌పై చర్యలు తీసుకోవాలంటూ బల్దియా కమిషనర్‌ లోకేష్‌కుమార్‌.. పబ్లిక్‌హెల్త్‌ అండ్‌ మున్సిపల్‌శాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌కు లేఖ రాశారు.

Published : 04 Feb 2023 03:17 IST

ఈనాడు, హైదరాబాద్‌: మహిళా ఉద్యోగినిపై వేధింపులకు పాల్పడిన ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ ఆర్‌.మోహన్‌సింగ్‌పై చర్యలు తీసుకోవాలంటూ బల్దియా కమిషనర్‌ లోకేష్‌కుమార్‌.. పబ్లిక్‌హెల్త్‌ అండ్‌ మున్సిపల్‌శాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌కు లేఖ రాశారు. అతడిని జీహెచ్‌ఎంసీ నుంచి తొలగించి ప్రాధాన్యం లేని, మహిళల సహచర్యం లేని పోస్టుకు బదిలీ చేయాలంటూ కోరడం చర్చనీయాంశమైంది. కమిషనర్‌ లేఖ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బల్దియాలో ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ ఆర్‌.మోహన్‌సింగ్‌ తనను వేధిస్తున్నాడంటూ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్న కె.లావణ్య ఇంటర్నల్‌ కంప్లయింట్‌ కమిటీకి ఫిర్యాదు చేసింది. కమిటీ దీనిపై విచారించగా.. సంబంధిత ఆరోపణలు వాస్తవాలేనని నిర్ధారిస్తూ నివేదిక ఇచ్చింది. ఈ రిపోర్టును కమిషనర్‌కు పంపగా.. దాన్ని జత చేస్తూ ఆర్‌.మోహన్‌సింగ్‌పై చర్యలు తీసుకోవాలంటూ లోకేశ్‌ కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని