logo

నత్త నడకన పనులు.. రాకపోకలకు పాట్లు

వంతెనలను సకాలంలో నిర్మించక పోవడంతో ప్రజలకు, వాహనదారులకు ఇక్కట్లు తప్పడంలేదు.

Published : 06 Feb 2023 00:52 IST

ధారూర్‌, న్యూస్‌టుడే: వంతెనలను సకాలంలో నిర్మించక పోవడంతో ప్రజలకు, వాహనదారులకు ఇక్కట్లు తప్పడంలేదు. గత 2016లో కురిసిన భారీ వర్షాలకు దోర్నాల్‌, ధారూర్‌ స్టేషన్‌ గ్రామ సమీపంలో మెథడిస్టు జాతర ప్రాంగణం దగ్గర వంతెన కొట్టుకుపోయింది. దీంతో రాస్నం, పగిడియాల్‌, నాగారం, గురుదోట్ల, అంపల్లి, మోమిన్‌కలాన్‌ తదితర 30 గ్రామాలకు పూర్తిగా రాకపోకలు నిలిచి పోయాయి. అప్పట్లో వాగు దాటే క్రమంలో ఓ వ్యక్తి ప్రాణాలు సైతం కోల్పోయాడు.

* 2018లో వంతెన నిర్మాణం కోసం రూ.4.70 కోట్లు మంజూరు చేశారు. పనులు చేపట్టిన గుత్తేదారు కొంత వరకు పూర్తిచేసి వదిలేశారు. గుత్తేదారు నిర్లక్ష్యమని మరో గుత్తేదారుకు పనులు అప్పగించారు. ఆరు నెలలవుతున్నా పిల్లర్లకే పరిమితమయ్యాయి. ఆరేళ్లుగా వర్షాకాలంలో అవస్థలు పడుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆయా గ్రామాల ప్రజలు వాపోతున్నారు. వరద వస్తే ప్రమాదాలు జరిగితే అధికారులు, ప్రజా ప్రతినిధులు హడావిడి చేసి త్వరగా వంతెన పనులు పూర్తిచేసి రాకపోకలకు ఇబ్బందులు తలెత్తకుండా చూస్తామని హామీలు ఇస్తారు. తర్వాత ఎవరూ పట్టించుకోవడం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వంతెన నిర్మాణం పనులు త్వరగా పూర్తిచేసి రాకపోకలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని