logo

అన్ని వర్గాలకూ సంక్షేమ బడ్జెట్‌: వకుళాభరణం

రాష్ట్ర బడ్జెట్‌ అన్ని వర్గాల సంక్షేమ సమ్మిళితమని తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు అన్నారు.

Published : 09 Feb 2023 01:57 IST

మాట్లాడుతున్న వకుళాభరణం కృష్ణమోహన్‌రావు, పక్కన కుమారస్వామి

కాచిగూడ, న్యూస్‌టుడే: రాష్ట్ర బడ్జెట్‌ అన్ని వర్గాల సంక్షేమ సమ్మిళితమని తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు అన్నారు. బుధవారం కాచిగూడలో ‘తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్‌- ప్రభుత్వ సమగ్ర ప్రణాళికలు’ అంశంపై జాతీయ బీసీ దళ్‌ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి ఆధ్వర్యంలో జరిగిన చర్చా వేదికలో ఆయన మాట్లాడారు. బలహీన వర్గాల సంక్షేమం, వ్యవసాయం,  పారిశ్రామిక రంగాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చారని పేర్కొన్నారు. తొమ్మిదేళ్లలో అభివృద్ధి ఎంత వేగంగా ముందుకు సాగిందో ప్రస్తుత బడ్జెట్‌ అంచనాలు స్పష్టం చేస్తున్నాయన్నారు. అభివృద్ధి ఫలాలు అందరికి అందేలా ప్రభుత్వ సమగ్ర ప్రణాళిక క్రమాన్ని బడ్జెట్‌లో పొందుపర్చారని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని