logo

జలమండలికి వరల్డ్‌ వాటర్‌ పురస్కారం

హైదరాబాద్‌ జలమండలికి వరల్డ్‌ వాటర్‌ పురస్కారం లభించింది. యునెస్కో, కేంద్ర జల్‌శక్తి, ప్రముఖ అంతర్జాతీయ పత్రిక వాటర్‌ డైజెస్ట్‌ సంయుక్తంగా 65...

Published : 19 Mar 2023 02:17 IST

అవార్డుతో జలమండలి ఎండీ దానకిషోర్‌, అధికారులు

ఈనాడు, హైదరాబాద్‌ : హైదరాబాద్‌ జలమండలికి వరల్డ్‌ వాటర్‌ పురస్కారం లభించింది. యునెస్కో, కేంద్ర జల్‌శక్తి, ప్రముఖ అంతర్జాతీయ పత్రిక వాటర్‌ డైజెస్ట్‌ సంయుక్తంగా 65 విభాగాల్లో నిర్వహించిన పోటీల్లో ప్రభుత్వ విభాగంలో ఉత్తమ మురుగుశుద్ధి అవార్డు లభించింది. దిల్లీలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్ర షెకావత్‌ అవార్డును జలమండలి ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ శ్రీధర్‌బాబుకు అందజేశారు. అవార్డును ప్రశంసాపత్రాన్ని శ్రీధర్‌బాబు శనివారం జలమండలి ఎండీ దానకిషోర్‌కు అందించారు. సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ల ప్రోత్సాహం వల్లే ఈ ఘనత దక్కిందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని