logo

వేప చెట్టే కాపాడింది!

ఓ ప్రైవేట్‌ పాఠశాల నుంచి 40 మంది విద్యార్థులతో బయలుదేరిన బస్సు అదుపు తప్పిన ఘటనలో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి.

Published : 21 Mar 2023 02:46 IST

 అదుపు తప్పిన స్కూల్‌ బస్సు
ఇద్దరు విద్యార్థులకు స్వల్ప గాయాలు

ప్రమాదానికి గురైన ప్రైవేట్‌ పాఠశాల బస్సు, సంఘటన స్థలంలో గాయపడిన చిన్నారులు

శామీర్‌పేట, న్యూస్‌టుడే: ఓ ప్రైవేట్‌ పాఠశాల నుంచి 40 మంది విద్యార్థులతో బయలుదేరిన బస్సు అదుపు తప్పిన ఘటనలో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. శామీర్‌పేట ఠాణా పరిధిలో సమీపంలో సోమవారం మధ్యాహ్నం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికులు, విద్యార్థుల వివరాలిలా.. మజీద్‌పూర్‌ గ్రామ పరిధిలోని శ్రీ టి.చైతన్య స్కూల్‌ బస్సు శామీర్‌పేట నుంచి తూంకుంట వైపు వెళుతోంది. దొంగలమైసమ్మ చౌరస్తా సమీపంలోకి రాగానే డ్రైవర్‌ అస్వస్థతకు గురికావటంతో బస్సు రోడ్డుకు కిందకు దూసుకుపోయి.. వేప చెట్టును ఢీకొట్టి ఆగిపోయింది. అద్దాలు పగిలిపోవడంతో ముందు సీటులో కుర్చున్న వర్ష, అలేఖ్య బయటపడగా స్వల్ప గాయాలయ్యాయి. పాఠశాల యాజమాన్యం సంఘటన స్థలానికి చేరుకుని గాయపడిన విద్యార్థులకు స్థానిక ఆస్పత్రిలో చికిత్సలు చేయించింది. వేపచెట్టుకు ఢీకొని ఆగడంతో విద్యార్థులంతా క్షేమంగా బయటపడ్డారని... లేకుంటే ప్రమాద తీవ్రత పెరిగేదని పలువురు వ్యాఖ్యానించారు. ఈ విషయమై ఎవరూ ఫిర్యాదు చేయకపోవటంతో కేసు నమోదు చేయలేదని ఇన్‌స్పెక్టర్‌ సుధీర్‌కుమార్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని