పిల్లల ఎదుటే భార్యను చంపిన భర్త
అమ్మ ప్రాణ భయంతో అరుస్తున్నా.. ఏం జరుగుతుందో తెలియక.. ఏడుస్తూ నిస్సహాయ స్థితిలో చూస్తున్న చిన్నపిల్లల ముందే ఓ వ్యక్తి మద్యం మత్తులో భార్యను గొంతు నులిమి హత్య చేశాడు.
అనంతరం ఠాణాలో లొంగిపోయిన నిందితుడు
సరిత, ధన వర్షిత్, ప్రీతి శ్రీకాంత్
శంకర్‌పల్లి మున్సిపాలిటీ, న్యూస్‌టుడే: అమ్మ ప్రాణ భయంతో అరుస్తున్నా.. ఏం జరుగుతుందో తెలియక.. ఏడుస్తూ నిస్సహాయ స్థితిలో చూస్తున్న చిన్నపిల్లల ముందే ఓ వ్యక్తి మద్యం మత్తులో భార్యను గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం ఠాణాలో లొంగిపోయాడు. ఈ సంఘటన ఆదివారం రాత్రి శంకర్‌పల్లి మండలం కొత్తపల్లిలో చోటుచేసుకుంది. సోమవారం ఘటన స్థలాన్ని నార్సింగి ఏసీపీ రమణగౌడ్, సీఐ మహేష్ గౌడ్ పరిశీలించారు. సీఐ వివరాల ప్రకారం..గ్రామానికి చెందిన శ్రీకాంత్(29)కు.. కొజ్జగూడెం గ్రామానికి చెందిన సరిత (25)తో 2016లో వివాహం జరిగింది. వీరికి ధన వర్షిత్(6), ప్రీతి(3) సంతానం. పెళ్లి అయిన ఆర్నెల్ల నుంచే దంపతుల మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. భర్త శ్రీకాంత్ మద్యానికి బానిసై, ఏ పని చేయకపోవడంతో కొంతకాలంగా వీరి మధ్య పలుమార్లు గొడవలు చోటుచేసుకున్నాయి. అనేకసార్లు పెద్దలు ఇరువురితో మాట్లాడి రాజీ కుదిర్చారు. 15రోజుల క్రితం గొడవ జరగ్గా సరిత పుట్టింటికి వెళ్లిపోయింది. పెద్దలు సర్దిచెప్పి ఆమెను అత్తింటికి పంపించారు. ఆదివారం రాత్రి పూటుగా మద్యం తాగిన శ్రీకాంత్ ఇంటికి వచ్చి భార్యతో గొడవ పడ్డాడు. అనంతరం భార్యను తోసేసి, ఆమెపై కూర్చుని గొంతు నులిమి హత్య చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ts-top-news News
రాష్ట్రంలో త్వరలోనే క్రీడాపాలసీ
-
Crime News
చాట్ జీపీటీతో జవాబులు.. ఎలక్ట్రానిక్ డివైస్‌తో చేరవేత!
-
Sports News
Ambati Rayudu: చివరి మ్యాచ్‌లో రాయుడు మెరుపు షాట్లు.. చిరస్మరణీయ ఇన్నింగ్స్‌తో ముగింపు
-
World News
Japan: ప్రధాని ఇంట్లో ప్రైవేటు పార్టీ.. విమర్శలు రావడంతో కుమారుడిపై వేటు!
-
India News
వీసాల్లో మార్పులు.. అండర్ గ్రాడ్యుయేట్లకు కాదు: యూకే మంత్రి
-
Sports News
Yashasvi Jaiswal: మైదానంలో నా ఆలోచనంతా అలానే ఉంటుంది: యశస్వి జైస్వాల్