logo

నాలుగేళ్ల బాలుడిపై వీధికుక్కల దాడి

ఐదు శునకాలు నాలుగేళ్ల బాలుడిపై  దాడికి పాల్పడ్డాయి.  కంచన్‌బాగ్‌ పరిధిలో జరిగిన ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాలుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

Published : 21 Mar 2023 02:46 IST

బాలుడి తలపై తీవ్రగాయాలు

కంచన్‌బాగ్‌: ఐదు శునకాలు నాలుగేళ్ల బాలుడిపై  దాడికి పాల్పడ్డాయి.  కంచన్‌బాగ్‌ పరిధిలో జరిగిన ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాలుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కేంద్ర ప్రభుత్వ, రక్షణ మంత్రిత్వ శాఖ ఆధీనంలో డీఆర్‌డీవో టౌన్‌షిప్‌లో ఈ తరహా సంఘటనలు తరచూ చోటుచేసుకుంటున్నాయి.  వివరాల్లోకి వెళితే.. పాతబస్తీ రక్షాపురానికి చెందిన బాలుడు(4) కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం రాత్రి ఓ వేడుకకు హాజరయ్యాడు. టౌన్‌షిప్‌లోని సామాజిక భవనం వెనుక పరిసర ప్రాంతాల్లో ఆడుకుంటున్నాడు. అక్కడే ఉన్న ఐదు కుక్కలు ఒక్కసారిగా బాలుడిపై దాడికి పాల్పడ్డాయి. తల, కడుపు, వీపు, చేతులు, కాళ్లపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చాయి. బాలుడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రతి శనివారం కుక్కలను పట్టుకుని వెళ్తామని చెప్పిన సిబ్బంది ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదని డీఆర్‌డీవో-బీపీఎంఎస్‌ కో-ఆర్డినేషన్‌ హైదరాబాద్‌ కమిటీ ఛైర్మన్‌ మహమ్మద్‌ మేరాజ్‌ అహ్మద్‌ ఆరోపించారు. ఎలాంటి హాని కలగకముందే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని