logo

సీఆర్‌పీఎఫ్‌ సౌత్‌జోన్‌ ఏడీజీగా రవిదీప్‌సింగ్‌ సాహి

సెంట్రల్‌ రిజర్వు పోలీసు ఫోర్స్‌(సీఆర్‌పీఎఫ్‌) సౌత్‌జోన్‌ అడిషనల్‌ డైరెక్టర్‌ జనరల్‌గా రవిదీప్‌సింగ్‌ సాహి గురువారం చాంద్రాయణగుట్టలోని గ్రూప్‌ సెంటర్‌ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు.

Published : 24 Mar 2023 02:40 IST

కేశవగిరి, న్యూస్‌టుడే: సెంట్రల్‌ రిజర్వు పోలీసు ఫోర్స్‌(సీఆర్‌పీఎఫ్‌) సౌత్‌జోన్‌ అడిషనల్‌ డైరెక్టర్‌ జనరల్‌గా రవిదీప్‌సింగ్‌ సాహి గురువారం చాంద్రాయణగుట్టలోని గ్రూప్‌ సెంటర్‌ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఆయన 1986లో అసిస్టెంట్‌ కమాండెంట్‌గా సీఆర్‌పీఎఫ్‌లో చేరారు. 37 సంవత్సరాలుగా రవిదీప్‌సింగ్‌ సాహి వివిధ పదవుల్లో జమ్మూకశ్మీర్‌, ఛత్తీస్‌గఢ్‌, నార్త్‌ఈస్ట్‌ రాష్ట్రాల్లో విధులు నిర్వహించారు. 2001 డిసెంబరులో పార్లమెంటుపై ఉగ్రదాడి అనంతరం లోక్‌సభ సెక్రటేరియట్‌ రవిదీప్‌సింగ్‌ సాహిని 2002లో జాయింట్‌ డైరెక్టర్‌(సెక్యూరిటీ)గా డిప్యూటేషన్‌పై నియమించింది. డిసెంబరు 2016 నుంచి మార్చి 2020 వరకు సీఆర్‌పీఎఫ్‌ శ్రీనగర్‌ సెక్టర్‌ ఐజీగా విధులు నిర్వహించారు. ప్రస్తుతం త్రిపుర సెక్టార్‌ ఐజీగా పని చేస్తున్న ఆయనకు పదోన్నతి లభిచింది. ఏడీజీగా బాధ్యతలు స్వీకరించిన రవిదీప్‌సింగ్‌ సాహికి సీఆర్‌పీఎఫ్‌ ఉన్నతాధికారులు శుభాకాంక్షలు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని