logo

ఒకటో తేదీనే జీతాలు చెల్లించాలి: యూటీఎఫ్‌

రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయులకు ప్రతినెలా ఒకటో తేదీనే వేతనాలు చెల్లించాలని టీఎస్‌ యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు వెంకటరత్నం డిమాండ్‌ చేశారు.

Published : 25 Mar 2023 02:21 IST

నిరసన వ్యక్తం చేస్తున్న నాయకులు

వికారాబాద్‌ టౌన్‌, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయులకు ప్రతినెలా ఒకటో తేదీనే వేతనాలు చెల్లించాలని టీఎస్‌ యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు వెంకటరత్నం డిమాండ్‌ చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రం వికారాబాద్‌లోని డీటీఓ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ఎయిడెడ్‌ ఉపాధ్యాయులకు మూడు నెలల వేతనాలు చెల్లించడం లేదని, ఉద్యోగ ఉపాధ్యాయులకు ఇతర సప్ల్లిమెంటరీ బిల్లులు, వేతనాలు, పీఆర్‌సీ బకాయిలు,  పెన్షన్‌దారుల బకాయిలు ఎనిమిది నెలలుగా సంబంధిత శాఖ ఖాతాల్లో జమకావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.  కార్యక్రమంలో టీఎస్‌ యూటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి రాములు, ఉపాధ్యక్షులు జమున, కార్యదర్శి పవన్‌కుమార్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని